జక్కన్న స్పందనతో ఘాజికి అదనపు బలం
విడుదల రోజు నుంచి అద్భుతమైన స్పందనతో మల్టీప్లెక్స్ ల దగ్గర నుంచి బి,సి సెంటర్ల వరకు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రతి ఆటకు బాల పడుతున్న ఘాజి చిత్రానికి ఇప్పుడు ఖర్చు లేని అదనపు ప్రచారం తోడైయ్యింది. అతి చిన్న సినిమాలకి కూడా తన ట్వీట్ ద్వారా పబ్లిసిటీని పెంచే దర్శక దిగ్గజం రాజమౌళి ఘాజి సినిమా విషయంలో విడుదల రోజు తన స్పందన తెలుపనప్పటికీ ఒక రోజు ఆలస్యంగా ఘాజి చిత్రాన్ని వీక్షించి తన స్పందనని తెలుపుతూ చేసిన ట్వీట్ తో ఘాజి విజయం దాదాపు ఖరారైపోయింది. ఇప్పటికే అన్ని రివ్యూస్ మరియు రేటింగ్స్ ఆశాజనకంగా ఉండటంతో పాటు కథని దారి మలపకుండా తెరకెక్కించిన విధానం అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే సమంత, రకుల్ ప్రీత్ సింగ్, త్రిష, మారుతీ, వంశి పైడిపల్లి వంటి ప్రముఖ సినిమా సెలబ్రిటీస్ ఘాజి చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేయగా, జక్కన్న తన ట్విట్టర్ ద్వారా కెప్టెన్ మరియు అతని క్రూ ప్రేరేపితమైన పనితనం చూపించారని ప్రశంసించారు.
Rivetting show by the captain and his crew. Both on screen and off screen.
Team Ghazi excells.
Congratulations.
Rana.....👍👍
- Tags
- ఘాజి