నగ్నంగా నటిస్తానంటున్న నందమూరి నాయిక
వెండి తెర కథానాయికలు మొదట్లో అందాల ఆరబోతలకు, కురచ దుస్తుల్లో కనిపించటానికి కొద్దిగా బెట్టు చేసినా తర్వాత తర్వాత బికినీ లలో కూడా దర్శనమిస్తుంటారు. అయితే దేని పారితోషికం దానికి ముడుతుంది అనుకోండి. ఇటీవల హాలీవుడ్ నటులు భారతీయ చిత్రాలలో నటించటం, మన నటులు హాలీవుడ్ చిత్రాలలో అవకాశాలు దక్కించుకోవటం కారణంగా మన ప్రేక్షకులపైనా హాలీవుడ్ మేకింగ్ ప్రభావం బాగానే కనపడుతుంది. అందుకే పర్చెడ్ లో రాధికా ఆప్టే నగ్నంగా నటించినప్పుడు కొన్ని సామాజిక సంఘాలు దుమ్మెత్తి పోసినా సగటు సినిమా ప్రేక్షకుడు దానిని ప్రత్యేక దృష్టి తో చూడలేదు.
అలానే కళ్యాణ్ రామ్ కత్తి, గగనం, మిస్టర్ నూకయ్య వంటి తెలుగు చిత్రాలలోనూ, మరి కొన్ని హిందీ, కన్నడ, తమిళ చిత్రాలలోనూ నటించిన సనా ఖాన్, తాను కూడా రాధికా ఆప్టే బాటే పడుతున్నానని చెప్పకనే చెప్పింది. సనా ఖాన్ నటించిన చిత్రాలు కమర్షియల్ విజయాలు కాకపోవటంతో అమ్మడికి పెద్దగా గుర్తింపు దొరకలేదు. కానీ చేసినా చిత్రాల సంఖ్యా మాత్రం 17. ఇప్పటికైనా పరిశ్రమ వర్గాలలో, ప్రేక్షకులలో తన పేరు నానాలని అనుకుందో ఏమో ప్రస్తుతం అడల్ట్ కంటెంట్ చిత్రం వాజహ్ తుమ్ హో అనే హిందీ చిత్రంలో నటిస్తుంది.
ఈ చిత్రంలో మరీ గ్లామర్ డోస్ పెంచేశారు అని తనకు ఎదురైన ప్రశ్నకి సమాధానంగా, "మన చిత్రాలు హాలీవుడ్ స్థాయికి ఎదగట్లేదు అని భాధ పడేవారే ఆ స్థాయిలో హద్దులు చెరుపుకుని నటులు నటించటానికి సిద్ధపడితే అంగీకరించే మనసు వారికి ఉండదు. నేను అయితే నగ్నంగా నటించటానికి కూడా సిద్దమే. అది బాలీవుడ్ లోనే కాదు దక్షిణ చిత్రాలలో ఐన నటించాల్సి వస్తే వెనుకాడను." అని బల్ల గుద్ది మరీ చెప్తుంది సనా ఖాన్.