పవన్... బ్రూస్ లీ కి మొగుడిలా ఉన్నాడు - వర్మ
కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్లీ డ్యూటీలో జాయిన్ అయ్యాడు రామ్ గోపాల్ వర్మ. నిన్న రిలీజ్ అయిన ‘అజ్ఞాతవాసి’ సినిమాకు సంబంధించి వర్కింగ్ స్టిల్స్ అండ్ పోస్టర్స్ లో పవన్ ఇంటెన్స్ లుక్తో కనిపిస్తున్నాడు. వాటిని చూసిన వర్మ ఎగ్జైట్ అయ్యి తనదైన శైలిలో ఫేస్ బుక్లో పోస్ట్లు మీద పోస్ట్లు పెట్టాడు. పవన్ కి వర్మ ముద్దిస్తున్నట్లుగా మార్ఫింగ్ చేసిన ఒక ఫొటోను కూడా వర్మ షేర్ చేశాడు. అసలు వర్మ.. పవన్ పై చేసిన కామెంట్స్ ఏంటో చూద్దాం..
'నేను గే కాదని అందరికీ తెలుసు. కానీ ప్రపంచంలో ఉన్న మొత్తం అందమైన అమ్మాయిలు అందరూ ఒక వైపున్నా నేను ఈ పోస్టర్లో ఉన్న అబ్బాయినే చూజ్ చేసుకుంటా'.
‘'నేను నా గత జన్మలో కూడా ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న అతణ్ని చూడలేదు. రజినీకాంత్.. అమితాబ్ బచ్చన్ ఎందుకూ పనికి రారు పీకే ముందు.. బ్రూస్ లీ కి మొగుడిలా ఉన్నాడు'
'పవన్ కళ్యాణ్ ముందు పుట్టాడా? ఎమోషన్ తర్వాత పుట్టిందా? అనేది చెట్టు ముందా విత్తు ముందా? కోడి ముందా గుడ్డు ముందా? అనే అనాది ప్రశ్నకి నా సమాధానం పవన్ కళ్యాణ్ ముందు పుట్టి మనందరికీ ఇప్పుడు ఎమోషన్ నేర్పుతున్నాడని.. హ్యాట్సాఫ్ పీకే'
అసలు అర్ధం కానీ విషయం ఏంటంటే... వర్మ చేసిన కామెంట్స్ అన్ని మనస్ఫూర్తిగా చేశాడా..లేదా తనదైన శైలిలో కౌంటర్లు వేశాడా.. అని పవన్ కళ్యాణ్ అభిమానులకి కూడా అర్ధం కాట్లేదు.