రామ్‌చరణ్ చిత్రంలో అనసూయ కీలకపాత్ర...!
'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రంలో తన పెర్ఫార్మెన్స్తో, గ్లామర్‌తో మెప్పించి వరుస అవకాశాలు పొందుతున్న హాట్ యాంకర్ అనసూయ. కాగా ప్రస్తుతం ఆమె రామ్‌చరణ్ నటిస్తున్న తాజా చిత్రంలో ఓ స్పెషల్సాంగ్తో పాటు కొంత పెర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న పాత్ర రావడంతో ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఆమె ఇంకా ఈ ప్రాజెక్ట్‌పై సైన్ చేయలేదని తెలుస్తోంది. అల్లుఅరవింద్ నిర్మాతగా గీతాఆర్ట్స్ బేనర్లో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తమిళ 'తని ఒరువన్' రీమేక్‌లో ఆమె నటించనుందని సమాచారం. కాగా ఇది రామ్‌చరణ్‌కు పదో చిత్రం. తమిళంలో వందకోట్లు వసూలు చేసిన 'తని ఒరువన్' చిత్రానికి రీమేక్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక గీతాఆర్ట్స్‌లో రామ్‌చరణ్ నటించిన 'మగధీర' చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం షూటింగ్ ఈనెల 22 నుంచి మొదలైంది. ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తుండగా, తమిళ వెర్షన్లో విలన్ పాత్రను చేసిన అరవింద్‌స్వామినే తెలుగులో కూడా విలన్ పాత్రను పోషిస్తున్నాడు. కాగా ఇందులో పోసానికృష్ణమురళి, నాజర్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు.