రాశి.. సామ్ ని ఫాలో అయితే బెటర్!
ఇప్పుడున్న హీరోయిన్స్ లో సమంతకి మంచి ఫాలోయింగ్ ఏ వుంది. అటు క్లాస్ సినిమాలు.. ఇటు మాస్ సినిమాలు రెండు బాలన్స్ చేసుకుంటూ కెరీర్ ని లీడ్ చేసుకుంటుంది. కానీ ఇప్పుడున్న హీరోయిన్స్ ఈ పద్దతి పాటించలేకపోతున్నారు. ముఖ్యంగా హీరోయిన్ రాశీ ఖన్నా.
రాశీ ఖన్నా స్టార్టింగ్ లో ఊహలు గుసగుసలాడే చిత్రం ద్వారా క్లాస్ ప్రేక్షకులకి బాగా దగ్గరైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ - రవి తేజ వంటి స్టార్ హీరోస్ తో నటించింది. ఆ సినిమాలేవి ఆమెకు అంతగా పేరు తెచ్చిపెట్టలేకపోయాయి. కానీ వరుణ్ తేజ్ తో చేసిన తొలిప్రేమ మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో నటనకు ఆస్కారమున్న పాత్ర చేసింది. ఇకపై తొలిప్రేమ లాంటి సినిమాలే చేయాలనీ డిసైడ్ అయిందంట రాశి.
అలా ఒకటే దానికి స్టిక్ అయితే కష్టం అంటున్నారు సినీ జనాలు. సమంతలాగ ప్లానింగ్ చేసుకుంటే కెరీర్ బాగుంటది అంటున్నారు. సమంత ఏ మాయ చేశావే లాంటి క్లాస్ మూవీ ద్వారా పరిచయం అయ్యింది. అలాగని క్లాస్ సినిమాలే చేసుకుంటూ వెళ్ళలేదు. ఒక పక్క ఈగ... ఎటో వెళ్లిపోయింది మనసు వంటి క్లాస్ మూవీలో చేస్తూనే మరో పక్క జబర్దస్త్... అత్తారింటికి దారేది లాంటి మాస్ సినిమాలలోనూ మెరిసింది. ఇప్పుడు రంగస్థలంలో కూడా చేస్తుంది. ఆమె చేసిన సినిమాల జాబితా... క్లాస్... మాస్ మూవీల కలయికగా ఉంటుంది. అందుకే ఆమెకు రెండు రకాల సినిమా అవకాశాలు ఇప్పటికీ వస్తున్నాయ్. సో రాశీ కూడా సామ్ ని ఫాలో అవుతే బెటర్