Tue Apr 23 2024 18:54:03 GMT+0000 (Coordinated Universal Time)
లారెన్స్ కూడా ఆ లిస్ట్‌లో చేరాడు....!
సినీ ఇండస్ట్రీలో ఆల్‌రౌండర్‌గా పిలిపించుకునే వారిలో లారెన్స్ ఒకరు. గ్రూప్ డ్యాన్సర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత కొరియోగ్రాఫర్‌గా, హీరోగా, దర్శకునిగా, నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా పలు రంగాల్లో సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఓ పాటను కూడా పాడి,మరో రికార్డు నెలకొల్పాడు. 'పటాస్' సినిమా తమిళ రీమేక్‌లో లారెన్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక మాస్ సాంగ్‌ను లారెన్స్ పాడాడు. ఈ సాంగ్‌లో ఆయన స్టెప్పులు కూడా ఇరగదీశాడని సమాచారం ఆ స్టెప్పులకు, బాణీకి తగ్గట్లుగా పాట కూడా మాంచి సౌండ్‌తో ఊపు మీద ఉండాలని ఆ బాధ్యత కూడా లారెన్సే తీసుకున్నాడట. మామూలుగా మాస్ సాంగ్‌లకు ఓ రేంజ్లో స్టెప్ప్లు వేసే లారెన్స్ ఈ సాంగ్‌లో ఎంతగా రెచ్చిపోతాడో చూడాలంటే కొద్దిరోజులు ఆగాలి. కాగా ఈ చిత్రంలో హీరోయిన్గా నిక్కీగిల్రాని నటిస్తోంది.
Next Story