లేని పుకార్లపై ప్రత్యేకించి ప్రస్తావన ఎందుకో?
ఒకప్పుడు సినిమా తారలు తమ వ్యక్తిగత జీవితాలపై వచ్చే కొన్ని వార్తలపై బెంబేలెత్తిపోతుండేవారు. వాస్తవాలకు దూరంగా వుండే ప్రేమాయణ పుకార్లంటే మరీ దడిచిపోయే వారు. అలాంటి పుకార్లకు ప్రేక్షకులు రియాక్ట్ అయితే వున్న కీర్తి ప్రతిష్టలకు భంగం కలగటంతోపాటు తదుపరి అవకాశాలు లేకుండా పోతాయేమో అనే భయం వారిని వెంటాడుతుండేది. కానీ నేటి తరం పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. సినిమాలు వున్నా లేకపోయినా ఇలాంటి వార్తలు, పుకార్లు ఏవో ఒకటి ప్రచారంలో ఉంటుండటం వల్ల సోషల్ మీడియా పుణ్యమా అని ప్రేక్షకుల నోటీసులో ఉండొచ్చు అనేది నేటి తరం నటీనటుల ఆలోచన. ఈ మధ్య సినిమాల సంఖ్య లో జోరు తగ్గించిన బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ ఇలాంటి ప్రచారణ ధోరణినే అవలంబిస్తుంది.
బాలీవుడ్ సెలబ్రిటీస్ కి క్రికెట్ క్రీడాకారులకు విడదీయలేని అనుబంధం ఉంటుంది. అది వారి వ్యక్తిగత స్నేహమే కావొచ్చు లేకపోతే పుకార్లే కావొచ్చు. అయితే కత్రినా కైఫ్ కి ఇంత కాలం సల్మాన్ ఖాన్, రన్బీర్ కపూర్ లతో సాగించిన ప్రేమాయణాలపై ఎన్నో వార్తలు వచ్చాయి కానీ క్రికెట్ క్రీడాకారులపై ఎలాంటి పుకార్లు రాలేదు. అయినప్పటికీ కత్రినా కైఫ్ సందర్భం కలిపించుకుని రాహుల్ ద్రావిడ్ పై తన ఇష్టాన్ని వేరే దృష్టితో చూడొద్దు అంటూ నొక్కి మరీ చెప్తుంది కత్రినా. "నాకు రాహుల్ ద్రావిడ్ అంటే చాలా ఇష్టం. ఎలాంటి ఒత్తిడి కి గురి చేసే క్లిష్ట పరిస్థితులలోనైనా కూల్ గా డీల్ చేసి టీం ని ముందుకు తీసుకెళ్లిన కెప్టెన్ గా రాహుల్ ద్రావిడ్ అంటే చాలా ఇష్టం. తొలి ఐ. పి.ఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ గా రాహుల్ ద్రావిడ్ ఉండేవారు. అప్పట్లో నేను ఆ టీం కి ప్రచార కర్తని. అప్పట్లో కూడా నేను ఆయనతో కేవలం మూడు సార్లే మాట్లాడాను. ఆయన కూడా చాలా మితభాషి. చాలా సెట్టిల్డ్ గా వుంటారు ఎలాంటి రిలేషన్స్ లోనైనా. అంతే తప్ప మా ఇద్దరి మధ్య మరెలాంటి సంబంధము లేదు." అంటూ అసలు ప్రచార లో లేని పుకారు ఒకటి తానే సృష్టించుకుని దానిపై ఒక స్పష్టత ఇచ్చే వంకతో వార్తల్లో నిలిచింది కత్రినా కైఫ్.