వర్మ నక్కను తొక్కాడే...ఎంత లాభం..?
ఎన్నో వివాదాల మధ్య సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ రూపొందించిన 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తిగా మియా మల్కోవా న్యూడిటీపై ఆధారపడి తీసిన 19 నిమిషాల నిడివి గల ఈ వీడియో విడుదలకు ముందు ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. లక్షల మంది ఈ వీడియో కోసం ఎదురు చూశారు. దానికి కారణం విడుదలకు ముందు ప్రణాళిక ప్రకారం వర్మ చేసిన పబ్లిసిటీ, రాజేసిన వివాదాలు అనేకం.
11 కోట్ల ఆదాయం....
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ వీడియోను స్నేహితులతో కలిసి వర్మే రూపొందించాడని తెలుస్తోంది. ఈ వీడియో నిర్మాణానికి దాదాపు 70 లక్షల రూపాయలు ఖర్చైందట. అందులో సింహభాగం మియా మల్కోవాకే వెళ్లిందట. ఇంకొంత రీ-రికార్డింగ్ చేసిన కీరవాణికి చెల్లించారట. ఇప్పటివరకు ఈ వీడియో వల్ల నిర్మాతలకు పదకొండు కోట్లకు పైగా ఆదాయం వచ్చిందట. అంటే రూ.70 లక్షలు ఖర్చుపెడితే 11 కోట్ల రూపాయల ఆదాయం. అందుకే వెంటనే జీఎస్టీ-2ను ఆర్జీవీ ప్రకటించాడు.
- Tags
- వర్మ