వావ్ అనిపిస్తున్న సందీప్ కిషన్ హీరోయిన్
సందీప్ కిషన్ సినిమా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన రెజీనాకు ఈమధ్య లక్ కలిసిరావట్లేదు. కొంచెం ఘాటుగా కనిపించినా ఉపయోగం లేకుండా పోతుంది. గ్లామర్ టచ్ ఇచ్చినా సినిమాలు ఏం అంతగా ఆమెకు పేరు తెచ్చిపెట్టలేకపోయాయి.
సాధారణంగా కనిపించి హిట్టు కొట్టిన రెజీనా గ్లామర్ గర్ల్ గా మాత్రం హిట్టు కొట్టలేకపోతోంది. కృష్ణవంశి నక్షత్రం సినిమాలో ఎలా కనిపించిందో అందరికి తెలిసిందే. స్పైసి అందాలను తెరపై ఎంతో అందంగా ప్రదర్శించింది. అయితే అసలు విషయం ఏంటంటే రెజీనాకు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో అందరిని షాక్ కి గురి చేస్తోంది.
రెడ్ డ్రెస్ లో వాటర్ ఫాల్స్ పక్కన ఇచ్చిన సెక్సీ స్టిల్ వావ్ అనిపించేలా ఉంది. పక్కనే ఓ యంగ్ హీరో కూడా ఉన్నాడు. ఆ స్టిల్ ఓ పాటలోది. ప్రస్తుతం రెజీనా కోలీవుడ్ హీరో గౌతమ్ తో మిస్టర్ చంద్రమౌళి అనే ఒక సినిమాను చేస్తోంది. విశాల్ తో ఇంద్రుడు అనే సినిమాకు దర్శకత్వం చేసిన శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కనీసం ఈ సినిమాతో అయిన రెజీనా బౌన్స్ బ్యాక్ అవుందేమో చూడాలి.