హాట్ హాట్ గా రెచ్చగొడుతుంది
జీరో సైజ్ అనే పదాన్ని అందరికి పరిచయం చేసిన కరీనా కపూర్ చాలా రోజులు బాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉంది. బాలీవుడ్ లో బాక్సాఫీసు వద్ద కోట్లు కొల్లగొట్టిన సినిమాల్లో కరీనా చాలా సినిమాల్లో నటించింది. బాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉండగానే బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ తో ప్రేమలో పడింది. అతనికి పెళ్ళై పిల్లలున్నా కూడా అతనినే పెళ్లి చేసుకుని.... ఒక బాబు (తైమూర్ఖాన్) కి జన్మనిచ్చింది. పెళ్లయిన కూడా సినిమాల్లో నటిస్తూనే బిజీగా ఉన్న కరీనా ప్రెగ్నెన్సీలో ఉన్నా కూడా.. హాట్ హాట్ ఫోటో షూట్స్, మ్యాగజైన్ కవర్ పేజెస్ మీద ఉండేలా చూసుకుంటూ ఎప్పటికప్పుడు హడావిడి చేసిన బేబో... ఫిట్ నెస్ మీద పూర్తి దృష్టి పెట్టి, డెలివరీ అయిన కొద్దీ రోజులకే మళ్ళీ తన రొటీన్ జీవితంలోకి వచ్చేసింది కరీనా.
పెళ్ళికి ముందు కరీనా ఎలా ఉందొ అలా తయారై మళ్ళీ ఇప్పుడు కెమెరా ముందుకు కాన్ఫిడెంట్ గా వచ్చేసింది. అలాగే ముందులా అందంగా వుంది కూడా. కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తూనే ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో అవకాశాలు కోసం ట్రై చేస్తుంది. అన్నిటికి సిద్ధంగా వున్నానని హాట్ హాట్ సంకేతాలు కూడా పంపుతుంది. నాకు పెళ్ళై, పిల్లలు పుట్టినా నా హాట్ నెస్ అస్సలు వదలిపెట్టనని... ఓపెన్ గా చెప్పేస్తుంది. మరి సినిమాల్లో గెటాన్ అవ్వాలి అంటే.... అందం చూపించడానికి హద్దే లేదంటూ దర్శక నిర్మాతలకు క్లారిటీ ఇచ్చేస్తుంది.
మరి ఇప్పుడు కరీనా కపూర్ ఒక మ్యాగ జైన్ కోసం చేయించుకున్న ఫోటో షూట్ సోషల్ ఇండియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడు కరీనా కపూర్ హాట్ హాట్ ఫొటోస్ షూట్ వీడియో కూడా టాప్ ట్రేండింగ్ లో ఉంది. మరి బెబో పిల్లలు పుట్టిన తన అందాన్ని ఎక్కడా దాచుకోకుండా అలా గ్లామరస్ గా చూపించేస్తుంది. ఇక కొడుకు తైమూర్ పేరు మీద కూడా కరీనా తన స్పందన ఎలా ఉందొ తెలియజేసింది. ఒక చిన్న పిల్లాడి పేరు మీద ఇంత రాద్ధాంతం చెయ్యడం అవసరమా అనిపించిందని.... మన సమాజం చాలా మారాలని చెబుతుంది.