1000 జీతమిస్తా అంటే.. 800 తీసుకోవడంలో అర్ధం లేదుగా!!

Ravi Teja telugu news

టాలీవుడ్ లో లేట్ వయసులో హీరోగా మారి.. ఎనేర్జిటిక్ పెరఫార్మెన్స్ తో దోసుకుపోయిన రవితేజ హిట్స్, ప్లాప్స్ తో కెరీర్ లాగించేస్తున్నాడు. వరసగా మూడు డిజాస్టర్స్ తో ఉన్న రవితేజ డిస్కో రాజాతో రేపు శుక్రవారం ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. అయితే రవితేజ పారితోషకం విషయంలో ఏ మాత్రం తగ్గడని.. సినిమాలు డిజాస్టర్స్ అయినా పారితోషకం విషయంలో పక్కాగా ఉంటాడనే ప్రచారం ఉంది. పారితోషకం సెట్ కాకపోతే సినిమాలు వదిలేస్తాడనీ అంటుంటారు. అయితే రవితేజ కూడా అదే చెబుతున్నాడు. నా స్థాయి, నా క్రేజ్ ని బట్టే నా పారితోషకం ఉంటుంది అంటున్నాడు.

నా సాలరీ 1000 ఉన్నప్పుడు నేను 800 తీసుకోవడంలో అర్ధం లేదని వాదిస్తున్నాడు. అయితే సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా తనదే బాధ్యత కానీ.. ఆ విషయంలో నేను ఎవరిని నిందించనని.. అలాగే నేను ఓసారి సినిమా ప్లాప్ అయినప్ప్పుడు నిర్మాత ఇచ్చిన చెక్ కూడా చింపేసానని చెబుతున్నాడు. మరి కెరీర్ డౌన్ ఫాల్ అయినపుడు పారితోషకం విషయంలో నిక్కచ్చిగా ఉంటే.. నిర్మాతలు ఆయా హీరోలను పక్కనబెట్టడం ఎంత సేపో పట్టదు. అయినా నేను ఇలానే ఉంటా అంటే ఎవ్వరూ ఏమి చెయ్యలేరు కదా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*