అందుకే భారతీయుడు 2 మీద అన్ని అనుమానాలు

2.0 collections telugu news telugu post

శంకర్ సినిమాలంటే భారీ తనంతో కూడుకున్నవే. గతంలో జెంటిల్మన్, భారతీయుడు సినిమాల దర్శకత్వం అప్పుడు కథకు ఇంపార్టెన్స్ ఇచ్చి సినిమాలో బడ్జెట్ ని కూడా చాల అంటే కథకు తగ్గవిధంగా చూసుకునేవాడు. కానీ రోబో సినిమా అప్పటినుండి శంకర్ సినిమాలకు హై బడ్జెట్ పెట్టేస్తున్నాడు. నిర్మాతలు కూడా శంకర్ దర్శకత్వంపై ఉన్న నమ్మకంతో పెట్టుబడి ఎంత పెట్టమన్నా గుడ్డిగా పెట్టేస్తున్నారు. రోబో సినిమా అప్పుడు భారీగా ఖర్చు పెట్టినా ఆ ఖర్చు ప్రతి ఫ్రెమ్ లోను కనబడింది. కానీ విక్రమ్ తో తీసిన ఐ సినిమాకి, 2.0 కి పెట్టిన ఖర్చు మాత్రం భారీగా ఉంది కానీ… ఆ సినిమాలకు అంత బడ్జెట్ ఎందుకు పెట్టాడో అర్ధం కాలేదు. ఐ అయితే మరీ వృధా ఖర్చే. అసలా సినిమాకి అంతెందుకు పెట్టాడో అర్ధం పర్ధం లేదు.

ఇక 2.0 కి ముంది 400 కోట్లనుకుంటే… తర్వాత అది 600 కోట్లయింది. గ్రాఫిక్స్ పనులు కంపెనీల చేతులు మారడంతో అంత ఖర్చు అయ్యింది . మరి గ్రాఫిక్స్ కి అంత ఖర్చు ఎందుకు పెట్టారో తేర మీద తెలియనే లేదు. అంటే వీక్ గా వున్నాయి గ్రాఫిక్స్ వర్క్. అయితే ఇప్పుడు ఈ అనుమానాల్ని భారతీయుడు 2 మీద మొదలయ్యాయి. ఐ సినిమాకి, 2.0 కి పెట్టించిన ఖర్చు చూసే దిల్ రాజు సైలెంట్ గా భారతీయుడు సినిమా నిర్మాతగా తప్పుకున్నాడేమో. మరి ఇప్పుడు భారతీయుడు 2 నిర్మాతలు కూడా భారతీయుడు 2 కోసం శంకర్ ఎంతపెట్టిస్తాడో అనే కంగారులో ఉన్నారట.

మరి 2.0 కి 600 కోట్లు బడ్జెట్ పెట్టినా అది సినిమా లో ఎక్కడ అంత భారీ తనం కనిపించలేదని.. 2 డి లో సినిమా చూసిన ప్రేక్షకుడి మాట. మరి 3 డి లో కాస్తో కూస్తో బావుందంటున్న ప్రేక్షకులు..2 డి లో చూసిన వారు 2.0 ని పెదవి విరుస్తున్నారు. మరి భారతీయుడు సినిమాలాంటి కథ అయితే భారతీయుడు 2 కి అంతగా పెట్టుబడి అవదు. ఎందుకంటే గ్రాఫిక్స్ పెద్దగా వాడక్కర్లేదు కాబట్టి. మరి కమల్ హాసన్ తో తియ్యబోయే ఆ భారీ భారతీయుడు 2 విషయంలో దర్శకుడి శంకర్ ఆలోచన ఎలా ఉందొ ఏమిటో కానీ.. ఇప్పుడు ప్రతి ఒక ప్రేక్షకుడు.. శంకర్ సినిమా చూడాలంటె కాస్త ఓపిక తెచ్చుకోవాలంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*