‘అభిమన్యుడు’ ఒక రేంజ్ లో ఆడుతుంది

విశాల్ ముఖ్య పాత్రలో సమంత హీరోయిన్ గా రూపొందిన చిత్రం ‘అభిమన్యుడు’. తమిళం లో ‘ఇరుంబు తిరై’ పేరుతో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయింది. తెలుగులో కూడా ఈ శుక్రవారం రిలీజ్ అయిన ‘అభిమన్యుడు’ మంచి టాక్ తో దూసుకుపోతుంది. డిజిటల్ ఇండియా నేపథ్యంలో ఒక సామాన్యుడు ఎదుర్కునే ఇబ్బందులే ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కింది.

కొత్త దర్శకుడు మిత్రన్ దర్శకత్వం చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 600 థియేటర్స్ లో విడుదల అయింది. విడుదల అయిన ప్రతి చోట మంచి రెస్పాన్స్ రావడంతో అదనంగా 60 థియేటర్స్ పెంచుతున్నారు. తెలుగు స్టేట్స్ లో మూడు రోజులు ముగిసేసరికి 7.10 కోట్లను వసూలు చేసింది. ఒక డబ్బింగ్ సినిమాకు ఈ స్థాయి వసూళ్లు రావడం నిజంగా గొప్ప విషయమని అంటున్నారు.

విశాల్ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాల్లో అటు తమిళ… ఇటు తెలుగులో హిట్ అయిన సినిమా ఇది ఒక్కటే. మొత్తానికి హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా బాగా సక్సెస్ అయ్యాడు విశాల్. మరి ఈ సినిమా విశాల్ కు ఎన్ని లాభాలు తెచ్చిపెడుతుందో చూద్దాం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*