ట్విస్ట్ అంటే ఇదేనేమో
మన డైరెక్టర్స్ కి మన హీరోల స్క్రిప్ట్ విషయంలో వేలు పెడితే నచ్చదు. తన క్రియేటివిటీ విషయంలో వేలు పెడితే ఆ ప్రాజెక్ట్ ను వదిలేసుకున్న డైరెక్టర్స్ [more]
మన డైరెక్టర్స్ కి మన హీరోల స్క్రిప్ట్ విషయంలో వేలు పెడితే నచ్చదు. తన క్రియేటివిటీ విషయంలో వేలు పెడితే ఆ ప్రాజెక్ట్ ను వదిలేసుకున్న డైరెక్టర్స్ [more]
మన డైరెక్టర్స్ కి మన హీరోల స్క్రిప్ట్ విషయంలో వేలు పెడితే నచ్చదు. తన క్రియేటివిటీ విషయంలో వేలు పెడితే ఆ ప్రాజెక్ట్ ను వదిలేసుకున్న డైరెక్టర్స్ మన దగ్గర చాలామందే ఉన్నారు. స్టార్ హీరోలు వేలు పెడితే ఎదురు చెప్పలేక చాలా సైలెంట్ గా ఉంటారు మన డైరెక్టర్స్. కానీ ఒక హీరో మాత్రం కథలో వేలు పెట్టాలని, వీలయినంతగా ఇన్వాల్వ్ కావాలని దర్శకులను కోరుకుంటున్నారు. అతనే అడివి శేష్.
ఎవరు పేరుతో….
డైరెక్టర్ గా అవుదామని వచ్చిన అడవి శేష్ కి క్రియేటివిటీ చాలా ఎక్కువ అని అతని గత సినిమాలు చూస్తే అర్ధం అయిపోతుంది. పైగా మనోడికి స్క్రిప్ట్ సెలక్షన్ బాగా తెలుసు. క్షణం, గూఢచారి చిత్రాల విజయాలలో అడవి శేష్ ఇన్వాల్వ్మెంట్ చాలా వుంది. ప్రస్తుతం అడవి శేష్ ‘ఎవరు’ అనే సినిమా రూపొందించాడు. ఈచిత్రం ఆగస్టు 15 న రిలీజ్ అవుతుంది. ఇది ఒక స్పానిష్ చిత్రానికి రీమేక్. ‘ఇన్విజిబుల్ గెస్ట్’ అనే ఈ చిత్రం తెలుగు లో ‘ఎవరు’ అనే పేరు తో రిలీజ్ అవుతుంది. కథ పరంగా ఇందులో చాలా ట్విస్ట్స్ ఉంటాయట. కానీ ఒరిజినల్ దాంట్లో ట్విస్ట్ ని మార్చేశాడు అడవి శేష్. ఇన్విజిబుల్ గెస్ట్ చూసిన వారు కూడా ఊహించలేని ట్విస్ట్ ఒకటి ఇచ్చాడట. దీనిపైనా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అడివి శేష్.