ఆది కూడా స్పోర్ట్స్ పైనే పడ్డాడు..!

adi pinishetti new movie update

`హైద‌రాబాద్ బ్లూస్‌`, `ఇక్బాల్` చిత్రాల ద‌ర్శ‌కుడు న‌గేష్ కుకునూర్ తెలుగులో తొలిసారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తిసురేష్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడి జోన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర నిర్మిస్తుండ‌గా.. ప్ర‌ముఖ డిజైన‌ర్ శ్రావ్య వ‌ర్మ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ.శివ‌ప్ర‌కాశ్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తుండ‌గా.. త‌ను వెడ్స్ మ‌ను ఫేమ్ చిత్తరంజన్ దాస్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం వికారాబాద్‌, పూణేల్లో షూటింగ్ జ‌రుగుతోంది. ఇంకా టైటిల్ పెట్ట‌ని ఈ చిత్రం ఇప్ప‌టికే నాలుగో భాగం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 2019లో విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*