సైరాపై… సీనియర్ హీరోస్ కామెంట్స్

సైరా సినిమా చూశాక టాలీవుడ్ నుంచి చాలా మంది సెలెబ్రెటీస్ రెస్పాండ్ అయ్యారు. ముఖ్యంగా తన సహ నటులు అయిన నాగార్జున, వెంకటేష్ రియాక్షన్స్ ఏంటో చిరు స్వయంగా చెప్పారు. ” నాతో పాటు నాగార్జున సినిమా చూశాడు. సినిమా చూసి బయటకు వచ్చిన తరువాత నన్ను నాగార్జున గట్టిగా వాటేసుకున్నాడు. అతనికి నోటి నుంచి మాట బయటకు రాలేదు. కళ్లు ఎర్రబడిపోయాయి. ఇదొక ఎపిక్ అన్నారు ఆయన”

ముద్దుపెట్టేశాడు….

“అలానే వెంకటేష్ ఫోన్ చేసి మీరు ఇంట్లోనే ఉంటారా? మిమల్ని కలవాలి అన్న అడిగారు. నేను ఇంటికి రమ్మన్నాను. రావడం రావడమే నన్ను గట్టిగా కౌగలించుకున్నారు. ఓ ముద్దు పెట్టేశారు. ఎంతకీ వదల్లేదు. అప్పుడు కూర్చొని సెటిల్ అయ్యారు. హమ్మయ్య ఇప్పటికి తన కోరిక తీరిందని చెప్పాడు వెంకీ” తన తోటి నటులు తన సినిమా గురించి ఇంతలా ఫీల్ అయి చెబుతుంటే, అంతకంటే తనకు కావాల్సిందేముందన్నారు చిరంజీవి. అలానే రజనీకాంత్ కూడా ఫోన్ చేసి సినిమా అద్భుతంగా ఉందని చెప్పడమే కాదు తన భార్య కూడా ఫోన్ తీసుకుని తనతో మెచ్చుకోవడం చాలా సంతోషం కలిగించిందన్నారు చిరంజీవి. త్రివిక్రమ్ చేసిన ఇంటర్వ్యూ లో ఈవిషయాన్ని బయట పెట్టాడు చిరు.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*