త్రిష ప్లేస్ లోకి ఐశ్వర్య రాజేశ్?

త్రిష

తమిళంలో సింగం సీరీస్ తో మంచి హిట్ మీదున్న దర్శకుడు హరి హీరో విక్రమ్ తో కలిసి స్వామికి సీక్వెల్ గా సామి స్క్వేర్ తెరకెక్కిస్తున్నాడు. గతంలో హరి – విక్రమ్ కాంబోలో వచ్చిన స్వామి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో… మళ్ళీ అదే కాంబోలో సామి స్క్వేర్ తెరక్కేకుతుంది. భారీ అంచనాలున్న ఈ కాంబో మీద అటు ట్రేడ్ లోను మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం విక్రమ్ అనేక సినిమాల ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇప్పుడు విక్రమ్ దర్శకుడు హరినే నమ్ముకున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో విక్రమ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే సామి స్క్వేర్ లో ఇద్దరు హీరోయిన్స్ ఉండగా.. మెయిన్ హీరోయిన్ గా కీర్తి ని తీసుకుంటే.. తర్వాతి హీరోయిన్ దర్శకుడు హరి త్రిష ని తీసుకున్నాడు.

ఇక సామీ 1 సినిమాలో విక్రమ్ – త్రిష లే హీరో హీరోయిన్స్ గా నటించారు. అయితే త్రిష ఉన్నట్టుండి సామి స్క్వేర్ నుండి తప్పుకోవడంతో.. చిత్ర బృందం నిర్మాతల మండలిలో త్రిష మీద కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఆమె వలన తమకు రెండు కోట్ల నష్టం వచ్చిందని… ఫిర్యాదులో పేర్కొంది. ఇక త్రిష అసలు సామి స్క్వేర్ నుండి తప్పుకోవడానికి కీర్తి సురేష్ కి సామి యూనిట్ సభ్యులు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడంతో హార్ట్ అయినా త్రిష చెప్పాచెయ్యకుండా ఈ సినిమా నుండి తప్పుకుందని ప్రచారం జరిగింది. ఇక అప్పటినుండి మరో హీరోయిన్ ని తీసుకొని సామి స్క్వేర్ బృందం తాజాగా త్రిష ప్లేస్ లోకి మరో కోలీవుడ్ హీరోయిన్ ని తీసుకున్నారు.

త్రిష చెయ్యాల్సిన ఆ పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్ ను సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారు. తమిళంలో ఐశ్వర్య రాజేశ్ కి మంచి క్రేజ్ వుంది. ఇక ఐశ్వర్య రాజేశ్ ఇప్పటికే విక్రమ్ జోడీగా ధ్రువ నచ్చత్తిరమ్ సినిమా చేస్తోంది. ఇక తాజాగా సామి సీక్వెల్ లో కూడా విక్రమ్ కి జోడిగా ఛాన్స్ కొట్టేసి త్రిష ని రీప్లేస్ చేసింది ఈ కుర్ర భామ. ఇక సామి స్క్వేర్ లో తనకొచ్చిన అవకాశానికి ఐశ్వర్య రాజేశ్ పొంగిపోతుంది. ఇకపోతే సామి స్క్వేర్ తెలుగు తమిళంలోనూ ఒకే రోజు భారీ స్థాయిలో విడుదలకానుంది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*