స్టైలిష్ స్టార్ మాస్ లుక్ కేక!!

Allu Arjun

పుష్ప పాన్ ఇండియా మూవీ షూటింగ్ స్టార్ట్ అవడము.. జోరుగా సెట్స్ లో పుష్ప టీం హడావిడి లీకవుతున్న ఫొటోస్ లో చూస్తూనే ఉన్నాం. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో అల్లు అర్జున్ కల్డ్ మాస్ లుక్ మాములుగా లేదు. మాస్ గా అల్లు అర్జున్ పుష్ప లుక్ కి అందరూ ఆశ్చర్యపోయారు. ఏడునెలల కరోనా టైం లోను అల్లు అర్జున్ పుష్ప మేకోవర్ లోనే ఉన్నాడు. అందుకే సినిమా షూటింగ్ మొదలవ్వగానే స్టయిల్ కోసం, మేకోవర్ కోసం టైం వెస్ట్ అనకుండా అల్లు అర్జున్ రంగంలోకి దిగిపోయాడు. పుష్ప సినిమా షూటింగ్ లో పుష్ప రాజ్ బ్యాక్ లుక్ మొన్నామధ్యన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్టైలిష్ హీరో, అందమైన హీరో, ఇలా మాస్ లుక్ లో చూడగానే అందరూ అబ్బా పుష్ప కి అల్లు అర్జున్ మేకోవర్ సూపర్ అన్నారు.

మరి షూటింగ్ సెట్స్ నుండి లీకవుతున్న పుష్ప ఫొటోస్ లో పుష్ప రాజ్ అదేనండి.. అల్లు అర్జున్ లుక్ చూస్తుంటే అమ్మో అనిపిస్తుంది. అల్లు అర్జున్ మేకోవర్ కి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు.  అల్లు అర్జున్ మాసిన బట్టలతో.. మాస్ గా కాదు బాబోయ్ ఊర మాస్ గా రఫ్ గా కనిపిస్తున్నాడు. అలా చూసిన వారు అల్లు అర్జున్ నెగెటివ్ గా కనిపిస్తాడేమో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరీ అంత మాస్ గా ఉన్నాడంటే.. అల్లు అర్జున్ పాత్ర పుష్ప లో ఏ రేంజ్ లో ఉండబోతుందో అనే అనుమానాలు వస్తున్నాయి. సుకుమార్.. అల్లు అర్జున్ పుష్ప పాత్రని వేరే లెవల్లో డిజైన్ చేసాడని మాత్రం అర్ధమవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*