‘అల వైకుంఠపురములో’ స్టోరీ ఇదే!

allu arjun gap with producers

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. త్రివిక్రమ్ గత సినిమాల మాదిరిగానే ఈసినిమా స్టోరీ కూడా ఉండబోతుంది. రెండు ఫ్యామిలీల మధ్య విబేధాల కారణంగా చిన్నప్పుడే తల్లిదండ్రులకి దూరమయిన కొడుకు పెద్దయ్యాక తన ఇంటికి పని వాడిగా వెళ్లిన హీరో ఎలా వారికి దగ్గర అవుతాడు అనేదే సినిమా. సినిమాలో ఒక ధనవంతుల కుటుంబం, పేద కుటుంబం ఉంటాయి. వీరి మధ్య విబేధాలు రాగా ఇద్దరు తండ్రులు తమ కొడుకులని పుట్టినప్పుడే మార్చుకుని పెంచుతారు.

బేసిక్ స్టోరీ ఇదే….

అలా ధనవంతుడైనా కానీ పేదవాడిగా పెరిగిన హీరో, పేదవాడైనా ధనవంతుడిగా పెరిగిన పిల్లాడు (సుషాంత్‌) ఎలా అయ్యారో అనేది ఈమూవీ బేసిక్ స్టోరీ అని తెలుస్తుంది. తండ్రులు గా మురళీశర్మ, జయరాం నటిస్తున్నారు. ఇక అన్ని సినిమాల మాదిరిగానే ఈసినిమాలో కూడా త్రివిక్రమ్ మార్క్ కామెడీ, ఎమోషనల్ డైలోగ్స్ ఉండనున్నాయి. చాలా గ్యాప్ తరువాత ఇందులో టాబు ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. వచ్చే సంక్రాంతి ఈమూవీ రిలీజ్ కానుంది.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*