సైరాకి బన్నీ వాయిస్ మాత్రమే ఇస్తాడా?

నయనతార

మెగా స్టార్ చిరంజీవి 152 వ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం “సైరా నరసింహారెడ్డి”. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో చిరంజీవికి సరసన నయనతార నటిస్తుంది. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈసినిమాలో అల్లు అర్జున్ కూడా ఉన్నాడని గత కొన్ని రోజులు నుండి వార్తలు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో అల్లు అర్జున్ నటించట్లేదని తెలుస్తుంది. కేవలం వినిపిస్తాడట.

ఈచిత్రంకు బన్నీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడట. సినిమా స్టార్టింగ్ నుండే బన్నీ వాయిస్ తో మొదలవుతుందని తెలుస్తుంది. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన హేమా హేమీ నటీ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆలాంటి ఈ మెగా ప్రాజెక్ట్ కు బన్నీ వాయిస్ కచ్చితంగా ప్లస్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయినా టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈసినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈసినిమా రిలీజ్ అయ్యే అవకాశముంది.

“నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమా తరువాత బన్నీ తన నెక్స్ట్ ఇంకా ప్రకటించలేదు. త్రివిక్రమ్ తో అంటున్నారు కానీ అది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. సో ఈలోపు బన్నీ ‘సైరా’ సినిమాకు వాయిస్ ఇవ్వనున్నాడు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*