అల్లు అర్జున్ ముందే వచ్చేస్తాడా..?

allu arjun movie release date

చాలా గ్యాప్ తరువాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా స్టార్ట్ చేసిన ఈ మూవీలో మరోసారి అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే నటించే ఛాన్స్ కొట్టేసింది. త్రివిక్రమ్ తో ఆమెకు ఇది రెండో సినిమా. అంతకముందు త్రివిక్రమ్ – పూజ కాంబినేషన్ లో అరవింద సమేత వచ్చింది. ఈ సినిమా ముందుగా దసరాకి విడుదల చేయాలనుకున్నారు. కానీ అదే సమయానికి చిరంజీవి ‘సైరా’ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెగాస్టార్ తో క్లాష్ ఎందుకులే అని వచ్చే ఏడాది సంక్రాంతి రావడానికి రెడీ అవుతున్నారు. త్రివిక్రమ్ – బన్నీ ఇద్దరూ ఇదే నిర్ణయం తీసుకున్నారట.

క్రిస్మస్ కే వచ్చేస్తారా..?

అయితే ఆల్రెడీ సంక్రాంతి రేస్ లో బాలయ్య – కేఎస్ రవికుమార్ సినిమా ఉంది. గత కొన్నేళ్ల నుండి బాలయ్య ప్రతి సంక్రాంతికి తన సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అలానే వచ్చే సంక్రాంతికి కూడా. ఇక మహేశ్ బాబు – అనిల్ రావిపూడి మూవీ, సాయిధరమ్ తేజ్ – మారుతి సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్టుగా చెప్పేశారు. అలానే తమిళ చిత్రం రజనీకాంత్ ‘దర్బార్’ కూడా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఇన్ని పెద్ద సినిమాలతో ఈ మూవీ కూడా పోటీ పడుతుందా? లేదా వాయిదా వేసుకుంటారా? లేదా డిసెంబర్ లో క్రిస్టమస్ హాలిడేస్ కి వస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ మూవీని అల్లు అరవింద్ తో కలిసి హారిక హాసిని వాళ్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*