అల్లు అర్జున్ ఎంత సఫర్ అవుతున్నాడో?

telugu news allu arjun ram charan

ఇండస్ట్రీలో ప్రస్తుతం రామ్ చరణ్ పేరు, మహేష్ పేరు విపరీతంగా మార్మోగిపోతోంది. రంగస్థలంతో రామ్ చరణ్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తే… వాటిని మహేష్ బాబు భరత్ అనే నేను తో తిరగరాస్తున్నాడు. కేవలం 20 రోజుల గ్యాప్ లో వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా నాన్ బాహుబలి రికార్డులను కొట్టేస్తున్నాయి. ఎక్కడ చూసిన రామ్ చరణ్ రంగస్థలం ముచ్చట్లు, మహేష్ భరత్ అనే నేను ముచ్చట్లు తప్ప మరేమి వినబడడంలేదు. మరి ఈ రెండు పెద్ద సినిమాలు చాలా తక్కువ గ్యాప్ తో హిట్ కొట్టాయి. ఇక ఇప్పుడు మరో పెద్ద సినిమా విడుదలకు సిద్దమవుతుంది. అల్లు అర్జున్ నా పేరు సూర్య మరో పది రోజుల్లోనే విడుదల కు సిద్దమవుతుంది.

వక్కంతం వంశి దర్శకుడిగా తెరకెక్కుతున్న నా పేరు సూర్య పై మంచి అంచనాలే ఉన్నాయి… కానీ ప్రస్తుతం రంగస్థలం, భరత్ అనే నేను సినిమాల హిట్స్ తో నా పేరు సూర్య మీద పెద్దగా క్రేజ్ క్రియేట్ అవడం లేదనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. అల్లు అర్జున్ కి ఫాన్స్ లో, ప్రేక్షకుల్లో విపరీతంగా ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఈ సినిమా కి కొత్త దర్శకుడు కావడం.. అతని మేకింగ్ స్టయిల్ ఎలా వుంటుందనే దానిమీద ప్రేక్షకులు ఒక అంచనాకి రాలేకపోతున్నారు. మరి ప్రస్తుతం రంగస్థలం, భరత్ అనే నేను రెండు సినిమాలు దర్శకుడి మేకింగ్ స్టయిల్స్ తోనే చాల పెద్ద హిట్ అయ్యాయి. మరి వక్కంతం డైరెక్షన్ కి కొత్త, మరి అతని మేకింగ్ స్టయిల్ ని కేవలం ఒక్క ట్రైలర్, టీజర్, సాంగ్స్ తో అంచనా వెయ్యడం కష్టం. అందుకే సినిమా మీద భారీ హైప్ క్రియేట్ కావడం లేదనే టాక్ వినబడుతుంది.

అందుకే అల్లు అర్జున్ కూడా నా పేరు సూర్య మీద భారీ క్రేజ్ తీసుకు రావడానికి చాల ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే రంగస్థలం హిట్ తో ఉన్న రామ్ చరణ్ ని సూర్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానించడం, పవన్ కళ్యాణ్ కి బహిరంగంగా సపోర్ట్ చెయ్యడం లాంటివి చేస్తున్నాడు. మరి అల్లు అర్జున్ ప్రయత్నం నా పేరు సూర్య కి ఎంతవరకు కలిసొస్తుందో మే 4 న తేలిపోతుంది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*