సూర్య కోసం కొత్త హీరోయిన్?

ప్రస్తుతం నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా దెబ్బకి అల్లు అర్జున్ మరో ప్రాజెక్ట్ కోసం బాగా గ్యాప్ తీసుకుంటున్నాడు. నా పేరు సూర్య సెట్స్ మీదున్నప్పుడే… అనేకమంది దర్శకుల చెప్పిన కథలు విన్న అల్లు అర్జున్ చివరికి మనం సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పిన కథకి కనెక్ట్ అయ్యాడని చెప్పినా… విక్రమ్ కుమార్ ని కూడా అల్లు అర్జున్ చాలా రోజులు హోల్డ్ లో పెట్టి తెగ వెయిట్ చేయించాడు. ఇక చివరికి …. విక్రమ్ చెప్పిన కథే ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో.. అల్లు అర్జున్ విక్రమ్ ని పిలిచి కొన్ని మార్పులు చేర్పులు చెప్పి పూర్తి స్క్రిప్ట్ ని రెడీ చెయ్యమని చెప్పాడట.

ఎలాగూ విక్రమ్‌ కుమార్‌కి ఏ సెంటర్స్‌, ఓవర్సీస్‌లో సాలిడ్‌ మార్కెట్‌ వుండడంతో తన డౌట్లు పక్కన పెట్టేసి ఈ సినిమా చెయ్యడానికి ఓకే చెప్పేసాడు. ఇక విక్రమ్ కుమార్ కథ, దర్శకత్వంలో అల్లు అర్జున్ మరికాన్ని రోజుల్లోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మొదలెట్టబోతున్నాడు. అయితే అల్లు అర్జున్ ఈ సినిమాలో ఒక కొత్త హీరోయిన్ తో నటించాలని అనుకునున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ చాలామంది భామలను తెలుగు తెరకు పరిచయం చేసాడు. గంగోత్రి సినిమాలో అదితి అగర్వాల్ ని, దేశముదురు సినిమాతో హన్సిక ని ఇలా చాలా సినిమాల్లో అల్లు అర్జున్ కొత్త హీరోయిన్స్ తోనే నటించాడు.

తాజాగా అల్లు అర్జున్ విక్రమ్ కుమార్ సినిమాలోనూ ఒక కొత్త హీరోయిన్ కోసం వెతుకుంటున్నట్టుగా వార్తలొస్తున్నాయి. మరి అల్లు అర్జున్ తన సరసన నటించబోయే అమ్మాయిని బాలీవుడ్ నుండి తీసుకొస్తాడో లేదంటే…ఏ మలయాళీ భామను వెతుకుతాడో చూడాలి. ఇక గీత ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ సినిమా మాత్రం త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*