అందులో ఎలాంటి నిజం లేదంటున్నారు

పూజ హెగ్డే Allu arjun telugu news

నా పేరు సూర్య తర్వాత బయట డైరెక్టర్స్ అంటే… కాస్త మీడియం డైరెక్టర్స్ తో సినిమా చేసే ఛాన్స్ తీసుకోకుండా త్రివిక్రమ్ తో సేఫ్ గా సినిమా ప్లాన్ చేసుకున్నాడు అల్లు అర్జున్. అయితే గత మూడు నెలలుగా త్రివిక్రమ్ – బన్నీ సినిమాపై ఎలాంటి ప్రకటన రాకపోయేసరికి ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది అని అనుకున్నారు. కానీ తాజాగా వారి కాంబోలో మూడో ప్రాజెక్ట్ త్వరలోనే మొదలవుతుంది అంటూ ప్రకటన వచ్చేసింది. అసలు త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా అనగానే… ఆ సినిమా హిందీ రీమేక్ అని ఒకసారి.. కాదు కాదు మరో కొత్త కథ తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు అంటూ ప్రచారం జరిగింది.

ఇక తాజాగా అల్లు అర్జున్.. త్రివిక్రమ్ కాంబోలో తన కొత్త చిత్రం ప్రకటించి ఇంకా ఒక రెండు రోజు లు కూడా కాలేదు…. అప్పుడే… ఆ సినిమా స్టోరీ లైన్ మీద మళ్ళీ సోషల్ మీడియాలో రకరకాల కథనాలు మొదలయ్యాయి. బన్నీతో త్రివిక్రమ్ తెరకెక్కించబోయే కథ తండ్రీ కొడుకుల అనుబంధానికి సంబంధించినదిగా ఉంటుందనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్. గతంలో త్రివిక్రమ్ – బన్నీ కాంబినేషన్లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి ఒక రకంగా తండ్రీ కొడుకులకి సంబంధించినదే. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇపుడు తెరెక్కబోయే సినిమా కథ కూడా ఉంటుందని ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని.. త్రివిక్రమ్ – బన్నీ కాంబోలో తెరకెక్కబోయే కథ ఎవరి ఊహకి అందని కొత్త స్టయిల్లో ఉండబోతుందని తాజా సమాచారం.

మరి త్రివిక్రమ్ – బన్నీ సినిమా ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీగా హారిక హాసిని వారు ప్రకటించకముందే… త్రివిక్రమ్ – బన్నీ సినిమా కథపై సోషల్ మీడియాలో మాములుగా రచ్చ జరగడం లేదు. చూద్దాం త్రివిక్రమ్ ఈసారి తన స్టయిల్ తోనే సినిమా చేస్తాడో లేదంటే.. అల్లు అర్జున్ స్టయిల్లోనే సినిమా చేస్తాడో చూద్దాం.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*