ఫ్రెష్ కథతో దిగుతారా ఏమిటి?

అల్లు అర్జున్

ప్రస్తుతం అల్లు అర్జున్… కూతురు అర్హ బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం గోవా లో ఉన్నాడు. నిన్న ఫ్యామిలీ మధ్యలో జరిగిన అల్లు అర్హ బర్త్ డే వేడుకలు గోవాలో ఘనంగా జరిగింది. అల్లు అర్జున్, స్నేహ అంతా కలిసి ఈ సెలెబ్రేషన్స్ లో ఎంజాయ్ చేశారు. అయితే అల్లు అర్జున్ ఇలా పార్టీలు అంటూ ఎంజాయ్ చేస్తున్నాడు కానీ…తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్ తో చేస్తున్నాడో అనేది మాత్రం చెప్పకుండా తాత్సారం చేస్తూనే ఉన్నాడు. విక్రమ్ కుమార్ తో సినిమా అని చాలా రోజులు విక్రమ్ కుమార్ ని హోల్డ్ లో పెట్టిన అల్లు అర్జున్ ఇక త్రివిక్రమ్ తో సినిమా ఫైనల్ అన్నప్పటికీ… ఇంకా ఆ సినిమా మీద క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ సినిమా విషయంలో అటు అల్లు అర్జున్ కానీ… ఇటు త్రివిక్రమ్ కానీ మాట్లాడకుండా సైలెంట్ గానే ఉంటున్నారు.

అయితే త్రివిక్రమ్ – అల్లు అర్జున్ మధ్య కథ చర్చలు ఎడతెగ కుండా నడుస్తోనే ఉన్నాయంటున్నారు. ముందుగా హిందీ ఫిలిం సోను కి టీటూ కీ స్వీటీ ని రీమేక్ చేద్దామనుకున్నారు. కానీ ఎందుకో వెనక్కి తగ్గారు. అయితే రీమేక్ రైట్స్ విషయంలో ఏదో తేడా వచ్చిందంటున్నారు. అల్లు అర్జున్ కి ఆ రీమేక్ మీద కన్నుంది. కాదు కాదు ఎలాగైనా సోను కి టీటూ కీ స్వీటీ సినిమానే రీమేక్ చెయ్యాలనుంది. కానీ త్రివిక్రమ్ మాత్రం ఫ్రెష్ కథతో సినిమా స్టార్ట్ చేద్దామంటున్నాడట. కానీ త్రివిక్రమ్ టాలెంట్ అజ్ఞాతవాసి, అ…ఆ విషయంలో ఏమైందో బన్నీ కి అనుభవంలోనే ఉంది. అందుకే త్రివిక్రమ్ ఫ్రెష్ కథంటే అల్లు అర్జున్ కి నమ్మబుద్దికావడం లేదట.

ఇక త్రివిక్రమ్ మాత్రం మళ్ళీ రీమేక్ తో సినిమా చేస్తే తన టాలెంట్ మీదున్న నమ్మకం స్టార్ హీరోల కి పోతుందనే భయంతోనే ఫ్రెష్ కథ అంటూ బన్నీ ని ఇంప్రెస్స్ చేసే పనిలో ఉన్నాడట. ఇక అల్లు అర్జున్ కూడా మంచి కథ రెడీ చేస్తే హిందీ మూవీ రీమేక్ వదిలేద్దామని త్రివిక్రమ్ కి మాటిచ్చినట్లుగా తెలుస్తుంది. మరోపక్క కేవలం మాట మాత్రమే కాదు.. ఇప్పటికే త్రివిక్రమ్ కొత్తగా స్టోరీ లైన్ ని బన్నీ కి వినిపించాడని… ప్రస్తుతం ఆ కథ గురించిన కసరత్తు మొదలైందని అంటున్నారు. మరి కథ పూర్తిగా సెట్ చేసుకున్నాకే త్రివిక్రమ్, అల్లు అర్జున్ లు పక్కాగా సెట్స్ మీదకెళ్తారని తెలుస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*