బాలీవుడ్ నుండి సౌత్ ని కూడా ఏలేస్తున్నాడు

మెగాస్టార్ చిరంజీవి సైరా

బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ ఈ వయసులోనూ స్టార్ హీరోలతో సమానంగా సినిమాలు చేసుకుపోతున్నాడు. కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లోను, కొన్ని సినిమాల్లోనూ గెస్ట్ రోల్స్ లోను, అలాగే తన వయసుకు సరిపోయే కీలక పాత్రల్లోనూ అమితాబచ్చన్ నటిస్తూ వస్తున్నాడు. ఇక ఎప్పుడు ఖాళీ లేకుండా సినిమాల షూటింగ్ లతో బిజీగా వుండే అమితాబ్ ఇప్పుడు పర భాషల్లోకి కూడా ఎంటర్ అవుతున్నాడు. ఇప్పటికే ఇండియా వైడ్ గా తెరకెక్కుతున్న సై రా నరసింహ రెడ్డి లో సై రా గురువు పాత్రలో సినిమాకి కీలక పాత్రలో నటించాడు అమితాబ్. చారిత్రాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈసినిమాలో గెస్ట్ రోల్ చెయ్యడానికి…. మెగాస్టార్ చిరు తో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆ సినిమా చేయడానికి అమితాబ్ ఒప్పుకున్నాడు. ఆ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, బాలీవుడ్ లలో విడుదలకు సిద్దమవుతుంది.

ఇక ఇప్పుడు అమితాబ్ తమిళనాట మరో మూవీలో నటించబోతున్నాడట. తమిళ యువ దర్శకుడు వణ్ణన్ తమిళనాట ఒక విభిన్నమైన కథా చిత్రాన్ని తెరకెక్కించే ప్లాన్ లో వున్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రకి గాను వణ్ణన్ ఎస్.జె. సూర్యను తీసుకున్నాడు. ఇక సినిమాలో అతి కీలకమైన మరో పాత్రకి గాను అమితాబ్ ను ఒప్పించినట్టు కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ టాక్. అయితే ఈ సినిమాలో అమితాబ్ చేసేది గెస్టు రోల్ కాదు… సినిమా అంతా అమితాబచ్చన్ కనిపిస్తూనే ఉంటాడని చెబుతున్నారు. ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*