అనసూయ ఏం మాయ చేస్తుందో…?

anasuya telugu post telugu news

బుల్లి తెరలో తన కెరీర్ ని స్టార్ట్ చేసి మెల్లగా వెండితెర మీదా తన సత్తా చాటుతుంది అనసూయ భరద్వాజ్. బుల్లితెరలో ప్రేక్షకులను ఎన్నాళ్ళుగానో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ ‘క్షణం’ సినిమాతో తనలోని నటనను ప్రేక్షకులకి చూపించింది. ఈ సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్ గా నటించి అందరిని మెప్పించగా..’రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా తెలుగువాళ్ళ హృదయాలను గెలుచుకుంది.

కథనం అనే థ్రిల్లర్ తో……

ఇక లేటెస్ట్ గా అనసూయ మరోసారి మరో సినిమాతో ప్రేక్షకులని మెప్పించేందుకు రెడీ అవుతోంది. ‘కథనం’ అనే థ్రిల్లర్ తో మనముందుకు వస్తున్నా ఈసినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విజయదశమి సందర్భంగా ఈరోజే రిలీజ్ చేశారు. మోషన్ టీజర్ లో అనసూయ ఏదో సీరియస్ గా రాస్తూ ఉంది.మరి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్ర చేస్తుందా..లేదా ఏదైనా క్రైమ్ థ్రిల్లర్ స్టొరీ ని రాస్తోందో తెలియదు గానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం పక్కాగా ఒక థ్రిల్లర్ స్టైల్ లోనే ఉంది.

ఎటువంటి పాత్ర….?

‘కథనం’ అంటే స్క్రీన్ ప్లే అని అర్ధం. మరి ఇందులో అనసూయ ఎటువంటి రోల్ చేస్తుందో అని ఇప్పటినుండే ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్.. ధనరాజ్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజేష్ నాదెండ్ల ఈ సినిమాకు దర్శకుడు. ఈసినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 34048 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*