అనసూయకు అంత లేదంట

Anasuya in chiranjeevi movie

హాట్ యాంకర్ అనసూయ కి సుకుమార్ రంగస్థలం లో రంగమ్మత్తగా ఎప్పటికి గుర్తుండిపోయే రోల్ ఇచ్చాడు. ఆ సినిమాతో అనసూయ బాగా పాపులర్ అయ్యింది. రామ్ చరణ్ రంగస్థలంతో అనసూయ కి మంచి హిట్ ఇచ్చాడు. అయితే కొరటాల శివ దర్శకత్వంలో చిరు నటించబోయే చిత్రంలోను అనసూయ ఓ కీలకపాత్ర చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే రీసెంట్ గా ఓపెనింగ్ చేసుకున్న కొరటాల – చిరు సినిమాలో చిరు ఉమెన్ హాకీ కోచ్ పాత్రలో కనిపించబోతున్నట్టు గా చెప్పడమే కాదు యంగ్ చిరు పాత్రకి చరణ్ చేస్తున్నట్టుగా ఫిలింనగర్ టాక్. ఈ సినిమాలో అనసూయ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని అసలు ఈ సినిమాలో అనసూయకి రోల్ ఏమంత ప్రాధాన్యత ఉండదని సమాచారం. తన పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటేనే నటించే అనసూయ ఈ చిన్న పాత్ర చేస్తుందా చెయ్యదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*