దాన్ని నేనెందుకు వదులుకుంటా!!

అనసూయ

జబర్దస్త్ ద్వారా హాట్ యాంకర్ గా అందరి మనస్సుల్లో తిష్ట వెయ్యడమే కాదు… కేవలం జబర్దస్త్ షో ద్వారానే తెగ పాపులర్ అయిన ఆంటీ అనసూయ… వెండితెర మీద అవక్షలతో ఉక్కిరి బిక్కిరి అవడంతో.. జబర్దస్త్ ని వదిలేస్తుందనే న్యూస్ గత వారం రోజుల నుండి ప్రచారంలో ఉంది. జబర్దస్త్ లో పెళ్లికాని యాంకర్స్ కూడా వెయ్యని హాట్ హాట్ చిట్టి పొట్టి డ్రెస్సులతో… యూత్ ని తనవైపు తిప్పుకున్న అనసూయ కి జబర్దస్త్ ప్రోగ్రామే ప్రాణం పోసింది. ఆ షోతోనే తను తెగ పాపులర్ అవడమే కాదు.. చేతినిండా సంపాదన పెరిగింది. మరి అలాంటి జబర్దస్త్ షో ని తను వదలడమా? నెవ్వర్ అంటూ కామెంట్స్ అపడుతున్నాయి కానీ…. తాను క్లారిటీ ఇవ్వడం లేదు.

తాజాగా తనకి మంచి లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ని నేనెలా వదులుకుంటానని.. సినిమాల్లో ఎన్ని అవకాశాలొచ్చినా.. తాను జబర్దస్త్ ని వదిలే ప్రసక్తే లేదంటూ సన్నిహితుల దగ్గర చెబుతుందట. తనకి కొరటాల – చిరు సినిమాతో పాటుగా ఎన్ని సినిమా అవకాశాలు వచ్చినా.. తాను మాత్రం జబర్దస్త్ ని విడిచి పోనని చెబుతుందట. తాను జబర్దస్త్ ప్రోగ్రాంను వీడే సమస్యే లేదని ఇప్పుడు వస్తున్న వార్తలన్నీ ఫేక్ వార్తలని అనసూయ కొట్టి పడేసినట్టు తెలుస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*