విలన్ గా పర్ఫెక్ట్ అయ్యేలా ఉంది
బుల్లితెర మీద హాట్ యాంకర్ కం జేడ్జ్ గా పిచ్చ క్రేజున్న ఆనసూయ వెండితెర మీద తనదైన పాత్రలతో చెలరేగిపోతుంది. క్షణం సినిమాలో అడవి శేష్ హీరో [more]
బుల్లితెర మీద హాట్ యాంకర్ కం జేడ్జ్ గా పిచ్చ క్రేజున్న ఆనసూయ వెండితెర మీద తనదైన పాత్రలతో చెలరేగిపోతుంది. క్షణం సినిమాలో అడవి శేష్ హీరో [more]
బుల్లితెర మీద హాట్ యాంకర్ కం జేడ్జ్ గా పిచ్చ క్రేజున్న ఆనసూయ వెండితెర మీద తనదైన పాత్రలతో చెలరేగిపోతుంది. క్షణం సినిమాలో అడవి శేష్ హీరో అయితే అనసూయ నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా ఇరగదీసింది. ఇక రెండు మూడు సినిమాల్లో గ్లామర్ పాత్రలేసిన అనసూయ రంగస్థలంలో రంగమ్మత్తగా ఇరగదీసింది. అలాగే కథనం, మీకు మాత్రమే చెబుతా సినిమాల్లోను అనసూయ మంచి పాత్రలతో ఆకట్టుకుంది. ఇక కృష్ణవంశీ రంగమార్తాండ లోను అనసూయ కీ రోల్ చేయబోతుంది. అయితే తాజాగా కొరటాల – చిరు సినిమాలో ఓ కీలక పాత్ర చెయ్యబోతున్న అనసూయ ఇకనుండి ఎక్కువగా విలన్ కేరెక్టర్స్ లోనే కనబడేలా ఉంది.
ఎందుకంటే అల్లు అర్జున్ – సుక్కు కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో అనసూయ బందిపోటు రాణిగా విలన్ షేడ్స్ లో కనిపించబోతుందనే న్యూస్ ఉంది. తాజాగా విజయ్ దేవరకొండ నిర్మించబోయే సినిమాలోనూ అనసూయ ఓ నెగటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ చేయబోతుంది అని అంటున్నారు. గతంలోనూ అనసూయ విజయ్ నిర్మించిన మీకు మాత్రమే చెబుతా సినిమాలోనూ నటించింది. తాజాగా అనసూయ మెయిన్ విలన్ గా విజయ్ సినిమా కథ ఉండబోతుంది అని… చెబుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన తొందర్లోనే వెలువడనుంది.. ఇక పవన్ – క్రిష్ సినిమాలోనూ అనసూయ ఓ రోల్ చేయబోతున్నట్లుగా కూడా టాక్.
- Tags
- à°à°¨à°¸à±à°¯