అనుకున్నది ఒకటి.. అయింది ఒకటి..

టీవీల్లో టీఆర్పీ రేటింగ్స్ కోసం ఏదైనా చేస్తారు మనవాళ్లు. ‘మా’ టీవీ ఛానల్ వారు బిగ్ బాస్ సెకండ్ సీజన్ అయిపోతున్న టైములో యాంకర్ ప్రదీప్ కు పెళ్లి చూపులు అంటూ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసారు. ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందనుకుని చాలామంది ఈ షో కోసం వెయిట్ చేసారు. తీరా షో స్టార్ట్ అయినా కొన్ని రోజులకి ప్రేక్షకులకి చిరాకు వచ్చి ఈ షో ను చూడటం మానేశారు. దాంతో ‘మా’ యాజమాన్యం ప్లాన్లు డిజాస్టర్ అయ్యాయి.

షో స్టార్ట్ అయినా దగ్గర నుండి తీవ్ర విమర్శలు ఎదురుకావడంతో ఫైనల్ గా దీనికి ముగింపు పలకాలనే ఆలోచనకు వచ్చినట్టు టాక్. మరో వారంలో దీనికి ఎండ్ కార్డు పడనున్నట్టు సమాచారం. ప్రదీప్ కి అక్క అంటూ సపోర్టింగ్ యాంకరింగ్ కి వచ్చిన సుమ తన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి ట్రాలింగ్ కు గురయ్యింది. ఇటివంటి రియాలిటీ షోస్ చేసేటప్పుడు కనీసం ఆలోచించాలి కదా అని నిలదీసిన వాళ్ళే ఎక్కువ.

మొత్తం మీద ఈ షో కు ఖరీదు 60 కోట్ల దాకా అయిందని సమాచారం. అంత అవ్వలేదు, మహా అయితే 25 కోట్లు అయి ఉండవచ్చు అని ఇన్సైడ్ టాక్. ఎంత ఖర్చు అయితే ఏంటి షో డిజాస్టర్ అయింది. ప్రదీప్ సైతం నవ్వులపాలయ్యాడు. అమ్మాయిలు ప్రదీప్ తో చేసే ఓవర్ యాక్షన్స్.. వారు చెప్పే ఏకిలి డైలాగ్స్ మొత్తంగా వెగటు పుట్టించాయి. ఇటువంటి రియాలిటీ షోస్ చేసేటప్పుడు ముందు కొన్ని ప్రాధమిక సూత్రాలు గుర్తు పెట్టుకోవడం చాలా అవసరం అని కొంతమంది పెద్దలు ఇస్తున్న సలహా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*