అను ఇమాన్యుయేల్ బుల్లి కోరిక

పెద్ద సినిమా చేస్తున్నారు అంటే హీరోయిన్స్ ఆడిందే ఆట పాడిందే పాట. వాళ్ళు ఏమి అడిగితే అది తీసుకుని రావాలి నిర్మాతలు. ఇక షూటింగ్ ఫినిష్ అయ్యాక కూడా హీరోయిన్.. హీరోలు గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకోవడం కామన్. షూటింగ్ కంప్లీట్ చేసుకుంది నా పేరు సూర్య. ఓ రొమాంటిక్ సాంగ్ తో ఈ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ఈ సాంగ్ ను హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ ను పట్టుకొచ్చి మరీ షూట్ చేశారు.

ఈ సాంగ్ తో సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్నారు నా పేరు సూర్య టీం. షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న సందర్భంగా బన్నీని హీరోయిన్ ఇమాన్యుయేల్ ఒక కోరిక కోరిందట. అదేంటో కాదు బన్నీతో కలిసి ఓ సెల్ఫీ దిగటమే. బన్నీ కూడా అను అడిగిన బుల్లి గిఫ్ట్ కి రెస్పాండ్ అయ్యి ఫోటోకు పోజ్ ఇచ్చాడు.

‘నా తోటి నటి అను ఇమాన్యుయేల్ అడిగిన ఫస్ట్ అండ్ లాస్ట్ థింగ్.. నాతో ఒక సెల్ఫీ దిగడం. సో స్వీట్. అను ఇమాన్యుయేల్ తో నా తొలి సెల్ఫీ. మూవీ షూట్ లో ఇదే లాస్ట్ షాట్’ అంటూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో తన అకౌంట్ లో పోస్ట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*