అనుపమ ఫ్యూచర్ ఆయన చేతుల్లో..!

anupama in bellamkonda movie

తెలుగులోకి వచ్చి తర్వాత చాలా తక్కువ కాలంలోనే మంచి సినిమాలు చేసి పేరు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్‌కి ఆ తర్వాత టైం అంతగా కలిసి రాలేదు. తెలుగులో ఒక్కప్పుడు యూత్ తో పాటు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ మలయాళీ భామ రీసెంట్ గా నటించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘తేజ్‌ ఐ లవ్యూ’, ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలు వరసగా ప్లాప్ అవ్వడంతో ఆమె అవకాశాలు తగ్గాయి. ఈ మూడు సినిమాలు ఫెయిల్ అయ్యాయి కానీ ఆమె పర్‌ఫార్మెన్స్‌ బాగా నచ్చడంతో రామ్‌ తన నెక్స్ట్ మూవీ ఛాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం అనుపమ.. రామ్ జంటగా ‘హలో గురూ ప్రేమ కోసమే’ అనే సినిమాలో నటిస్తున్నారు.

హిట్ అయితే ఓకే… కాకపోతే.?

దీన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి కూడా అనుకున్నంత బజ్ లేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్, రెండు సాంగ్స్ యావరేజ్ గా ఉండడంతో ప్రేక్షకులు దీనిపై ఇంట్రెస్ట్ చూపట్లేదు. దానికి తోడు దిల్ రాజు, రామ్, అనుపమ కొన్ని సినిమాల నుండి ఫామ్ లో లేరు. అయితే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు త్రినాధరావు నక్కిన మాత్రం ఊపు మీద వున్నాడు. ఆయన డైరెక్షన్ లో ‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్‌’ చిత్రాలతో వినోదాత్మక చిత్రాలు అందిస్తాడనే పేరు అతనికి వుంది. సో ఈ సినిమా రిజల్ట్ అతనిపైనే ఉంది. అసలే పోటీ వాతావరణంలో వస్తోన్న ఈ చిత్రం ఎంతవరకు నిలదొక్కుకుంటుందనేది చూడాలి. ఈ సినిమా హిట్ అయితే పర్లేదు..హిట్ కాకపోతే అనుపమ తెలుగులో అవకాశాలు రావడం కష్టమే.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*