మీటూ పై అనుపమ షాకింగ్ కామెంట్స్

అనుపమ పరమేశ్వరన్ Anupama Parameshwaran has no films in hand

మలయాళం లో ‘ప్రేమమ్’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్..తెలుగు లో కూడా ‘ప్రేమమ్” రీమేక్ లో నటించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. చాలామంది యంగ్ హీరోస్ తో నటించిన అను స్టార్స్ హీరోస్ తో చేసే ఛాన్స్ మాత్రం దక్కలేదు. ఈమధ్య ఈ మలయాళ బ్యూటీ కి వరస పరాజయాలు ఎదురు అవుతున్నాయి.

దాంతో ఆమెకు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు అంతంత మాత్రానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనుపమ ఇండస్ట్రీ లో జరుగుతున్న కొన్ని సంఘటనలపై, మీటూ ఉద్యమం పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ” చూసే కళ్ళని బట్టే లోకం కనిపిస్తుంది. దూరం నుండి చూసేవాళ్లకి ఇండస్ట్రీ గురించి తెలియదు. ఇండస్ట్రీ లో ఉన్నవారికే ఈ రంగం గురించి పూర్తిగా తెలుస్తుంది.

నేను నావరకు ఎలా ఉన్నాను…ఎవరితో ఎలా ఉన్నాను అనేదే ముఖ్యం. ఎవరి లిమిట్స్ లో వారు ఉంటె ఏ సమస్య రాదు. ఇండస్ట్రీ కి చాలామంది హీరోయిన్స్ అవుదాం అని వస్తుంటారు. అందులో కొంతమందే స్టార్ హీరోయిన్స్ గా మారతారు. ఆలా ఎన్నో ఏళ్లుగా పరిశ్రమని నమ్ముకుని, ఇక్కడే ఉన్నారంటే వాళ్లకు ఎలాంటి సమస్యలూ లేనట్టేగా. ఆలా ఎవరి లిమిట్స్ వారు ఉంటె అంత హ్యాపీగానే ఉంటుంది” అంటుంది ఈ చిన్న బ్యూటీ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*