ప్రేమా.. లేదూ.. దోమా.. లేదు!!

అనుష్క శెట్టి

గత ఐదేళ్లుగా అనుష్క పెళ్లిపై రకరకాల వార్తలు మీడియాలో వస్తూనే ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ – అనుష్క పెళ్లిపై పుకార్లు షికార్లు చేసాయి. అనుష్క – ప్రభాస్ ఎక్కడ కలిసి కనబడినా పెళ్లి పై ఏదో ఓ న్యూస్ రావడం.. దానిని ఇద్దరూ ఖండించడం జరుగుతుంది. నిన్నగాక మొన్న కూడా అనుష్క ని పెళ్లి చేసుకుటానికి రేడి అవుతున్న ప్రభాస్ అన్నారు. ప్రభాస్ కూడా లవ్ లో ఉన్న కారణంగానే పెద్దవాళ్ళు చూసిన పిల్లకి నో చెబుతున్నాడని అంటున్నారు. బాహుబలి తో ఐదేళ్లు, సాహో తో రెండేళ్లు, తాజాగా జాన్ తో మరో రెండేళ్లు పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి ఓ మిస్టరీగా మారడము, దీనికి అనుష్క పెళ్ళికి లింక్ అవడంతో.. రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వస్తూనే ఉంది.

తాజాగా అనుష్క నేనెవరి ప్రేమించలేదు.. నేను ప్రేమలో ఉన్నట్లుగా .. నాకు వేరేవారెవరితోనో పెళ్లి అంటూ వార్తలు రావడం కాస్త ఇబ్బందికరం, అలాగే కాస్త బాధ గాను ఉంటుంది అని.. ఇక తన మనసులో ఎవరూ లేరు అని.. పెద్దవాళ్ళు చూసిన పెళ్లి కొడుకునే నేను పెళ్లి చేసుకుంటా అని.. తన పెళ్లిపై రీసెంట్ గ అనుష్క ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. మరి అనుష్క – ప్రభాస్ లు ఎప్పటికప్పుడు చెబుతున్నా వీళ్ళ పెళ్లపై పుకార్లకు ఫుల్ స్టాప్ పడడం లేదు. కనీసం అనుష్క ఇంత చెప్పకైనా వింటారేమో చూద్దాం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*