‘అరవింద సమేత’ ఆడియో రిలీజ్ డేట్..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతుంది. అక్కడ ఎన్టీఆర్ తో పాటు కొంతమంది నటీనటులపై త్రివిక్రమ్ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటికి వచ్చింది.

ఈ నెలలోనే ఆడియో విడుదల…

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఆడియో ఈ నెల 20న విడుదల అవుతున్నట్టు సమాచారం. ఇక ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా జరపాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. అయితే దానికి సంబంధించి అధికార ప్రకటన వెలుబడాల్సి ఉంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆల్బమ్ పై మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్ లో తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ సినిమా సాంగ్స్ పై మరింత అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.

రాయలసీమ నేపథ్యంలో…

రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ చిత్తూరు యాసలో చెప్పే డైలాగ్స్ సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు. ఇక పూజా హెగ్డే తొలిసారిగా ఎన్టీఆర్ కు జోడిగా ఈ మూవీలో నటిస్తోంది. త్రివిక్రమ్ స్నేహితుడు అయిన సునీల్ ఇందులో ఫుల్ లెంగ్త్ కమెడియన్ గా కనిపించనున్నాడు. హాసిని హారిక క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*