అరవింద కూడా అద్భుతమేనండి!

పూజా హెగ్డే

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ లు అరవింద సమేత గురించిన ఇంటర్వూస్ తో సినిమా మీద అంచనాలు పెంచేస్తుంటే.. ఈ సినిమా లో లీడింగ్ రోల్ అంటే అరవింద సమేత టైటిల్ రోల్ పోషించిన పూజా హెగ్డే మాత్రం ప్రమోషన్స్ కి దూరంగా ఉంటుంది. పూజ హెగ్డేకి ఉన్న బిజీ షెడ్యూల్స్ వల్ల అరవింద సమేత ప్రమోషన్ లో పాల్గొనలేకపోతుంది అన్నది తెలిసిన విషయమే. మరి ఎన్టీఆర్ ఎప్పటిలాగే ప్రమోషన్స్ లో జోరు చూపిస్తుంటే.. త్రివిక్రమ్ ఎన్నడూ లేనిది ఒక సినిమా ప్రమోషన్స్ తో ఎన్టీఆర్ తో పాటు పాల్గొంటూ సోలో ఇంటర్వూస్ కూడా ఇస్తున్నాడు. కానీ ప్రమోషన్స్ లో అరవింద మిస్సింగ్ మాత్రం పూడ్చలేని లోటుగానే కనబడుతుంది.

అందరి గురించి వార్తలు వస్తున్నా…

ఎందుకంటే నిన్న సెన్సార్ రివ్యూ, టాక్ లోనూ అందరూ ఎన్టీఆర్ నటన ఆహా ఓహో….. త్రివిక్రమ్ సూపర్, జగపతి బాబు విలన్ గా అదుర్స్, సునీల్ నీలాంబరి గా కామెడీ ఎమోషన్స్ పండించాడు అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఎక్కడా అరవిందగా చేసిన పూజా హెగ్డే నటన, ఆమె అందం, ఆమె డాన్స్ ల లాంటివేమీ వినిపిస్తే ఒట్టు. ప్రస్తుతం ప్లాప్స్ లో ఉన్న పూజ హెగ్డే అరవింద సమేత మీద భారీ ఆశలే పెట్టుకుంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ని తన చుట్టూ తిప్పుకునే కేరెక్టర్ లో నటించిన పూజా గ్లామర్ పరంగా చాల బాగుంది అనేలా రెడ్డి ఇక్కడ చూడు సాంగ్ లో కనబడుతుంది.

పూజ డ్యాన్స్ కూడా హైలైట్ అంట…

రెడ్డి ఇక్కడ చూడు సాంగ్ లో ఎన్టీఆర్ తో పోటీగా స్టెప్స్ లో ఇరగదీసింది పూజ హెగ్డే. అంతేకాకుండా గ్లామర్ షో పరంగాను పూజ అద్భుతం అనేలా కనబడుతుంది. కాకపోతే మరీ సన్నగా అసలు ఒంట్లో కండ ఉందా లేదా అన్నట్టుగా ఉన్న పూజ హెగ్డే ఎన్టీఆర్ పక్కన హుషారుగా స్టెప్స్ వేయడంలో బాగానే పోటీ పడినట్టు ఉంది. మరి ఈ సినిమాలో అనగనగా అనే పాటలో, రెడ్డి ఇక్కడ చూడు పాటలో పూజ హెగ్డే ని చూసివారు అరవింద కూడా అద్భుతమేనండి అంటారు. ఇక పూజ హెగ్డే నటన గురించి, ఆమె అందం గురించి పొగడాలి అంటే కొన్ని గంటలు వెయిట్ చెయ్యాలి.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*