వ‌చ్చేనెల‌ బాక్సాఫీస్ కళకళలాడిపోతుందా?

గత రెండేళ్లు నుండి టాలీవుడ్ లో సమ్మర్ లో వచ్చిన సినిమాలు ఏవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ ఈ ఏడాది ఆలా లేదు. ‘రంగస్థలంస‌, ‘భరత్ అనే నేనుస‌, ‘మహానటి’ సినిమాలు వచ్చి ఓ కొత్త ట్రెండ్ ను సృష్టించాయి. కానీ సమ్మర్ మూగియ‌గానే బాక్స్ ఆఫీస్ డల్‌గా మారిపోయింది. ముఖ్యంగా జూన్ నెలలో వచ్చిన సినిమాలు ఏవీ అంతగా ఆడలేదు. ఆ నెలలో నిఖార్సయిన హిట్టు ఒక్కటీ పడలేదు.

ఈ నెల కూడా అంతేనా

అదే పరిస్థితి జులైలో కూడా ఉండే అవకాశం ఉంది. ఈ నెల కూడా ఏమి అంత ఎగ్జైటింగ్‌గా కనిపించడం లేదు. చిన్న – మీడియం రేంజ్ సినిమాలు ఉన్నపటికీ వాటిమీద అంతగా అంచనాలు లేవు. అయితే ఆగస్టు నెలలో మళ్లీ బాక్సాఫీస్ వేడి రాజుకోబోతోంది. మంచి క్రేజ్ ఉన్న సినిమాలు ఆ నెలలో రిలీజ్ అవుతున్నాయి. ముందుగా ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు అడివి శేష్ ‘గూఢచారి’ గా వస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయినా టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఆ తర్వాత వారంలో అంటే ఆగస్టు 9న దిల్ రాజు సంస్థ నుంచి ‘శ్రీనివాసకళ్యాణం’ రాబోతోంది. దింట్లో నితిన్ – రాశి ఖన్నా హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి.

ఆగ‌ష్టులో వ‌రుస సినిమాలు

అలానే విజయ్ దేవరకొండ – రష్మిక హీరోహీరోయిన్ గా వస్తున్న ‘గీత గోవిందం’ ఆగస్టు 15న షెడ్యూల్ అయింది. విజయ్ సినిమా కాబట్టి దీనిపై కూడా అంచనాలు ఉన్నాయి. ఇక అదే వీకెండ్లో అక్కినేని నాగచైతన్య సినిమా ‘సవ్యసాచి’ రాబోతోంది. దీనికీ మంచి హైప్ ఉంది. చైతు రెండో సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా కూడా ఆ నెలాఖరుకు షెడ్యూల్ అయి ఉంది. ఇలా ఆగష్టు లో వరసబెట్టి సినిమాలు రిలీజ్ అవ్వడంతో అంత ఇప్పటి నుండే ప్లాన్స్ వేసుకుంటున్నారు ఏ సినిమాకు వెళ్లాలి అని. దాంతో ఈసారి బాక్స్ ఆఫీస్ ఆగష్టు లో కళకళలాడేలా కనిపిస్తోంది.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*