ఫాన్స్ కి గుడ్ న్యూసే కానీ..

kalyanram remunaration for mahanayakudu

బాలకృష్ణ సినిమాల్లోనే కాదు.. బయట కూడా ఎంత ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారో కోపమొస్తే ఆయన ఫాన్స్ కి కోటింగే. అయినా బాలయ్య కొడితే ఫాన్స్ కి కోపం రాదు. సంతోషంగా ఫీలవుతారు. ఇక సినిమాల్లో గంభీరంగా పవర్ ఫుల్ గా డైలాగ్స్ చెప్పే బాలయ్య బయట మాట్లాడేటప్పుడు తడబడుతుంటారు. అలాగే ఆయనకి డాన్స్ అన్నా, పాటలు పాడడం అంటే మహా సరదా. బాలకృష్ణ – పూరి కాంబోలో వచ్చిన పైసా వసూల్ మూవీలో మామా ఏక్ పెగ్ లా అంటూ అదరగొట్టేసాడు. ఇక మొన్నామధ్యన ఆయన తండ్రి నందమూరి తారక రామారావు గారుకి ఒక సినిమాలో ఆలపించిన శివ శంక‌రీ.. పాట పాడి షాకిచ్చారు బాలయ్య.
అయితే ఆ శివ శంక‌రీ.. పాట బాలయ్య పాడడం చాలామందికి రుచించలేదు.. ఆ పాట పాడిన బాలయ్యని విమర్శించారు కూడా. అయినా బాలకృష్ణ ఆ విమర్శలను మనసులో పెట్టుకోలేదు. కాబట్టే రేపు బాలయ్య తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జన్మదినం సందర్భంగా ఓ సాంగ్ పాడి ఫాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా బాల‌య్య పాడిన శ్రీ‌రామ దండ‌కం.. రేపు ఉద‌యం స‌రిగ్గా 9 గంట‌ల 45 నిమిషాల‌కు రిలీజ్  చెయ్యబోతున్నారు. నిన్ననే రేపు ఉదయం ఓ స్మాల్ సర్ప్రైజ్ అంటూ ఎన్ బీకే ఫిలిమ్స్ నుండి ప్రకటన రావడం ఈ రోజు ఉదయం బాలయ్య పాటని రేపు రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా ప్రకటించడం ఫాన్స్ కి ఉత్సాహాన్నిచ్చింది. కానీ కొంతమంది బాలయ్య మాకెందుకయ్యా ఈ పనిష్మెంట్ అంటున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 37845 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*