#BangaramSaysSS అర్థం ఇదే..!

karthikeya hash tag story

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ లో అధిక భాగం దర్శక ధీరుడు రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లిలో రాజస్థాన్ జైపూర్ లో సందడి చేస్తున్నారు. గత రెండు రోజులుగా సంగీత్, పెళ్లి వేడుకల్లో టాలీవుడ్ టాప్ స్టార్స్ భాగమయ్యారు. అక్కినేని నాగార్జున దగ్గర నుండి.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు భార్యలతో సహా ఆ పెళ్లి వేడుకలకు హాజరయ్యారు. సంగీత్ వేడుకల్లో రాజమౌళి, నాగార్జున, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, రానా ఇంకా చాలామంది స్టార్స్ చేసిన హంగామా సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతుంది. ఇక రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ఎప్పటికప్పుడు కార్తికేయ – పూజ పెళ్లి వేడుకలను సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తుంది. అయితే ఉపాసన.. కార్తికేయ – పూజ పెళ్లి వేడుకలు అప్ డేట్ చేసినప్పుడు #BangaramSaysSS అనే హ్యాష్ ట్యాగ్ ను వాడుతుంది.

ఏమిటీ హ్యాష్ ట్యాగ్

ఇక ఉపాసన తర్వాత ఇతర సెలబ్రిటీస్ కూడా కార్తికేయ – పూజల వెడ్డింగ్ విశేషాలను ఫ్యాన్స్ తో పంచుకునేటప్పుడు అలాగే #BangaramSaysSS అనే హ్యాష్ ట్యాగ్ ను జత చెయ్యడంతో.. అసలు #BangaramSaysSS అనే హ్యాష్ ట్యాగ్ ఏమిటా అనే ఆలోచనలో టాలీవుడ్ ప్రేక్షకులు ఉన్నారు. కార్తికేయ పెళ్లి విషయాలతో పాటుగా ఈ #BangaramSaysSS హ్యాష్ ట్యాగ్ పై మీడియాలో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ #BangaramSaysSS హ్యాష్ ట్యాగ్ మీనింగ్ ఏమిటంటే… కార్తికేయ తన లవర్ అయిన భార్య పూజని ప్రేమగా బంగారం అని పిలుచుకుంటాడట. పూజ కూడా కార్తికేయని ప్రేమగా ఎస్ఎస్ అని పిలుస్తుందట.

వీరిద్దరి ఆలోచననే…

ఇక కార్తికేయ, పూజని పిలిచే బంగారం పేరుని కార్తికేయ ఇంటిపేరుని కలిపి ఉపాసన, చరణ్ లు ఇలా #BangaramSaysSS హ్యాష్ ట్యాగ్ తయారు చేశారట. ఇక గత రాత్రి జరిగిన కార్తికేయ – పూజల పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు.. రాజమౌళి కోడలు, జగపతి బాబు అన్నకూతురు పూజ పెళ్లి పల్లకిని బాహుబలి హీరో ప్రభాస్ మోయడం, ఈ పెళ్లిలో చాన్నాళ్ళకి అనుష్క సందడి చెయ్యడం, రామ్ చరణ్, అఖిల్, ఎన్టీఆర్, రానా వంటి వారు ఈ పెళ్ళిలో బాగా ఎంజాయ్ చెయ్యడం.. అన్నీ టాలీవుడ్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తున్నాయి.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*