ఆ… సినిమాల్ని దూరం పెట్టిన మాస్ హీరో

రాక్షసుడు

బెల్లంకొండ శ్రీనివాస్ మొన్నటివరకు చేతికి ఎటువంటి సినిమా వస్తే అది ఏమి ఆలోచించకుండా చేసేవాడు. ‘రాక్షసుడు’ ముందు చిత్రం సీత వరకు అన్ని మాస్‌ చిత్రాలే చేసినా శ్రీనివాస్ ‘రాక్షసుడు’ సినిమాతో ఇక మాస్ చిత్రాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ‘రాక్షసుడు’ సినిమాతో మంచి హిట్ అందుకున్న శ్రీనివాస్ తన తరువాత చిత్రాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉండే విధంగా మంచి చిత్రాలు చేయాలనీ నిర్ణయించుకున్నాడు.

అన్నీ డిఫరెంటేనా…

అసలే మనోడి రేంజ్ లో చాలామంది హీరోస్ ఉన్నారు. ఏమాత్రం శ్రీనివాస్ గ్యాప్ ఇచ్చినా చాలు దూరి వెళ్లిపోవడానికి రెడీ గా ఉన్నారు. చాలామంది హీరోలు రెగ్యులర్ కథలకు దూరంగా ఉండి వెరైటీ చిత్రాల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ ఒత్తిడి బెల్లంకొండ పై పడడంతో ఆయన మాస్ సినిమాలని దూరం పెట్టనున్నాడు. ప్రస్తుతం అన్ని డిఫరెంట్ గా ఉండే కథలే వింటున్నాడంట. మనోడికి హిందీ లో కూడా మంచి మార్కెట్ ఉంది కాబట్టి ఇప్పుడే మంచి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఎలాగో నిర్మాతలు తనతో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మార్కెట్ పడిపోకుండా చూసుకోవడం మాత్రం తన చేతుల్లోనే వుందని తెలుసుకున్నాడు బెల్లంకొండ. చూద్దాం నెక్స్ట్ ఎటువంటి సినిమాలు చేస్తాడో…

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*