‘కవచం’ రిజల్ట్ తో కళ్యాణ్ రామ్ హ్యాపీ

Kavacham Review Telugu movie News

అప్పుడప్పుడు మన హీరోస్ తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు కానీ కొన్నికొన్ని సార్లు కరెక్ట్ చేస్తారు..కొన్నికొన్ని సార్లు రాంగ్ చేస్తారు. ఏంటి వీడు ఏదోఏదో వాగుతున్నాడు అని అనుకుంటున్నారా? అదేనండి స్క్రిప్ట్స్ సెలక్షన్ విషయంలో ఒకొక్క హీరో కొన్ని సార్లు తప్పు చేస్తాడు..కొన్నిసార్లు కరెక్ట్ చేస్తాడు. కొన్ని కథలు తమ చేతులు మారి వేరే చేతిలో పడిన తరువాత అవి హిట్ అయితే ఒకలా ఉంటుంది..ఫెయిల్ అయితే ఇంకోలా ఉంటుంది.

Kajal Agarwal in Kavacham movie

ప్లాప్ అయితే కరెక్ట్ పని చేసాం అనుకుంటారు..హిట్ అయితే మాత్రం ఎందుకు వదిలేశాం దేవుడా.. అని బాధ పడుతుంటారు. హీరో కళ్యాణ్ రామ్ వ్యవహారం ఇప్పుడు మొదటి రకానికి చెందినది. బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ‘కవచం’ సినిమా సబ్జెక్ట్ ఫస్ట్ కళ్యాణ్ రామ్ దగ్గరకే వచ్చిందంట. ఆ సబ్జెక్ట్ కళ్యాణ్ రామ్ కు పెర్ ఫెక్ట్ గా వుంటుందని భావించి అతగాడి దగ్గరకు ఈ స్క్రిప్ట్ ను డైరక్టర్ శ్రీనివాస్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

Kavacham movie review

కానీ కళ్యాణ్ రామ్ ఎందుకో దాన్ని ఎంకరేజ్ చేయకపోవడంతో అది బెల్లంకొండ శ్రీనివాస దగ్గరకు వెళ్ళింది. బహుశా అప్పటికే కళ్యాణ్ రామ్ అలాంటి పాత్ర వేసి ఉన్నాడు కాబట్టేమో. గత శుక్రవారం రిలీజ్ అయినా ఈసినిమా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. బహుశా ఈ సినిమా రిజల్ట్ బట్టి కళ్యాణ్ రామ్ ఉపిరి పీలుచుకుని ఉంటాడు. బెల్లంకొండ ఈమూవీ ఓకే చేయడానికి కారణం ఇప్పుడు వరకు అతను పోలీస్ పాత్ర చేయకపోవడం. సో కళ్యాణ్ రామ్ సేఫ్ అయ్యాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*