హిట్ లేదు కానీ.. రెమ్యునరేషన్ మాత్రం

bellamkonda srinivas movie release date

బెల్లంకొండ శ్రీనివాస్ కు తెలుగులో లాగానే హిందీ లో కూడా మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా అతని సినిమాలు తెలుగు లో ఎలా ఉన్నా హిందీ శాటిలైట్ విష‌యంలో బెల్లంకొండ‌కు బాగానే గిట్టుబాటు అవుతోంది. అక్కడ నుంచి కనీసం శ్రీనివాస్ కి 6 నుంచి 7 కోట్ల వ‌ర‌కూ వ‌స్తున్నాయి. తెలుగులో శాటిలైట్ డిజిట‌ల్ రైట్స్ అన్నీ క‌లుపుకుంటే మ‌రో 4 కోట్లు వేసుకోవచ్చు. ఇలా మనోడి సినిమా అంటే రిలీజ్ కి ముందే 10 కోట్లు బిజినెస్ ఈజీగా జరిగిపోతుంది.

పదికోట్లు…….

ఈ బిజినెస్ ను  ఆసరాగా తీసుకుని మనోడు రెమ్యూనరేషన్ 10 కోట్లు చెబుతున్నాడు అంట. రీసెంట్ గా ఓ డైరెక్టర్ వెళ్లి కథ చెబితే కథ నచ్చింది కానీ రెమ్యూనరేషన్ 10 కోట్లు అయితే చేస్తా అని కండిషన్ పెట్టడంతో ఆ దర్శకుడు వేరే హీరో దగ్గరకు వెళ్ళిపోయాడు. నిజానికి బెల్లంకొండ సినిమాల‌న్నింటికీ ఒకప్పుడు తన తండ్రి సురేష్ బ్యాక్ బోన్‌గా ఉంటూ వ‌స్తున్నాడు. కానీ ఇప్పుడు మనోడికి మార్కెట్ ఉండడంతో వేరే నిర్మాతలు వస్తే శాటిలైట్ రేట్లు చూపించి పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడు. దాంతో మనోడితో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎవరు పెద్దగా ఇంట్రస్ట్ చూపట్లేదు. శ్రీనివాస్ వెనక్కి తగ్గి 5 – 6 అయితే బెల్లంకొండ‌తో సినిమా గిట్టుబాటు అయిపోతుంది. లేకపోతే కష్టమే అంటున్నారు. ఈ రెమ్యూనరేషన్ పెంచడానికి మరో కారణం కూడా ఉంది. అదే అతని లాస్ట్ మూవీ రాక్ష‌సుడు మూవీ హిట్ అవ్వడం.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*