ఆ కుర్ర హీరోకు కాస్ట్ లీ హీరోయిన్లే కావాలా... ఏంటా స్టోరీ?
ఆ కుర్ర హీరో సినిమా లైఫ్ చాలా ఇంట్రస్టింగ్. అతడి కెరీర్లో కమర్షియల్‌గా లాభాలు తెచ్చిన సినిమా ఒక్కటైనా లేదు. హిట్ సినిమాలు ఉన్నా అవన్నీ బడ్జెట్ ఓవర్ అవ్వడంతో కమర్షియల్‌గా మాత్రం లాభాలు తెచ్చిపెట్టేలేదు. ఓ సారి అతడి సినిమాల్లో అతడి పక్కన నటించిన హీరోయిన్ల లిస్టు చూస్తే మొదటి సినిమాలో సమంత… రెండవ సినిమాలో సోనారిక (హరహర మహదేవ్ ఫేం)… మూడో సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రజ్ఞా జైస్వాల్… మధ్యలో తమన్నాతో రెండు సార్లు ఐటెం సాంగ్స్… రిలీజ్‌కు రెడీ అవుతోన్న నాలుగో సినిమాలో ఇప్పుడు టాప్ హీరోల పాలిట కల్పవృక్షంలా మారిన పూజా హెగ్డే హీరోయిన్.
తర్వాత సినిమాకు కూడా.......
ఈ కథంతా చదువుతూ ఉంటే వరుసగా స్టార్ హీరోయిన్లతో నటించిన హీరో ఎవరో ఈ పాటికే మీకు బ్రెయిన్ లో ఆ హీరో పేరు తట్టేసే ఉంటుంది. స్టార్ ప్రొడ్యుసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్. మరి ఈ లిస్టు చూస్తే బహుశా ఏ టాలీవుడ్ హీరో కూడా కెరీర్ స్టార్టింగ్‌లో ఇలా వరుసగా టాప్ హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసి ఉండడు. ఇక ఈ లిస్టు ఇక్కడితో అయిపోయిందా అని ఫుల్‌స్టాఫ్ పెట్టొద్దు. మనోడి నెక్ట్స్ సినిమాకు కూడా అప్పుడే ఓ క్రేజీ కాంబో సెట్ చేసేశారు. శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడి నేతృత్వంలో శ్రీను నటిస్తోన్న కొత్త సినిమాకు ఇప్పటికే కాజల్ అగర్వాల్ ను ఒక హీరోయిన్ గా ఎంపిక చేయగా, తాజాగా ‘ఐ’ ఫేం అమీ జాక్సన్ ను మరో హీరోయిన్ గా సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
బెల్లంకొండ తగ్గడం లేదు.....
హాట్ హీరోయిన్ గా అమీకున్న గుర్తింపు తెలియనిది కాదు. సోషల్ మీడియాలో అయితే ఈ లండన్ బ్యూటీ ఒక క్రేజీ అండ్ హాట్ బాంబ్. అలాంటి హీరోయిన్ ను తన తదుపరి సినిమాకు ఎంపిక చేయడం బహుశా బెల్లంకొండకే చెల్లింది. కొడుకుకు క్రేజీ కాంబో హీరోయిన్లతో సెట్ చేసేందుకు బెల్లంకొండ ఏమాత్రం వెనుకాడడం లేదని ఇండస్ట్రీ టాక్. ఇంకా చెప్పాలంటే బెల్లంకొండ మార్కెట్ అంత లేకపోయినా ఆయనే తెరవెనక బినామీగా ఉంటూ కొందరు నిర్మాతలతో కొడుకు సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాడన్న టాక్ కూడా ఉంది.
రెమ్యునరేషన్ కు కూడా...
స్టార్ హీరోయిన్లను బుక్ చేసేందుకు బెల్లంకొండ రెమ్యునరేషన్ల విషయంలో ఏ మాత్రం వెనుకాడడం లేదట. అంతే కాదు బెల్లంకొండ శ్రీనివాస్ డైరెక్టర్ల లిస్టు చూసినా టాప్‌గానే ఉంది. వివి.వినాయక్, బోయపాటి శ్రీను, శ్రీవాస్ ఇలా వీళ్లతో పాటు దేవిశ్రీ లాంటి టాప్ సాంకేతిక నిపుణులే అతడి సినిమాలకు పని చేస్తున్నారు.