భరత్ మాత్రం తగ్గేది లేదంటున్నాడు

మహేష్ బాబు భరత్ అనే నేను హావ మరో రెండు రోజుల పాటు కొనసాగుతుంది. మరి ఈ రెండు రోజుల తర్వాత అల్లు అర్జున్ నా పేరు సూర్య తో థియేటర్స్ లోకి దిగుతున్నాడు. ఇక భరత్ కలెక్షన్స్ కి ఈ శుక్రవారంతో గండి పడే అవకాశం ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ నా పేరు సూర్య పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే మహేష్ బాబు ఈ 15 రోజుల్లో కావాల్సిన దాని కన్నా ఎక్కువే లాగేసాడు. అంతః కరణ శుద్దితో అంటూ ప్రేక్షకులను పడగొట్టేసిన మహేష్ బాబు బిగ్ హిట్ అందుకున్నాడు. కొరటాల శివ మహేష్ ని ఈ సినిమాతో ఆదుకున్నాడనే చెప్పాలి. రెండు డిజాస్టర్స్ తో ఉన్న మహేష్ కి మళ్ళీ కొరటాల భరత్ తో భారీ హిట్ అందించాడు.

ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అదరగొట్టే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అలాగే ఓవర్సీస్ లోను మహేష్ తన సత్తా చాటాడు. ఓవర్సీస్ లో భారీ వసూళ్ల తో దూసుకుపోతున్న భరత్ అనే నేను కేవలం పదిరోజుల్లో అమెరికాలో 21కోట్ల గ్రాస్ ను సాధించింది. అంతే కాకుండా మహేష్ కి ఓవర్సీస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఆస్ట్రేలియా లోను 10 రోజుల్లోనే 2.23 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. అయితే ఈ ప్రాంతాల్లో మహేశ్ సినిమాలకు ఇంత సమయంలో ఈ స్థాయి వసూళ్లను సాధించడం మాత్రం భరత్ అనే నేను కె సాధ్యమైంది. ఇకపోతే భరత్ అనే నేను ఫుల్ రన్ ముగిసేనాటికి ఈ సినిమా మరిన్ని వసూళ్లను రాబట్టడం ఖాయమని చెబుతున్నారు.

మరి కొరటాల కు ప్రేక్షకుల నాడి ఎంత బాగా తెలుసుననేది మాత్రం ఈ భరత్ అనే నేను తో మరోమారు ప్రూవ్ అయ్యింది. మహేష్ ని సిఎం గా కొరటాల మలిచిన తీరుకి ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరధం పడుతున్నారు. అందుకే మహేష్ బాబు కలెక్షన్స్ పరంపర కొనసాగిస్తున్నాడు. మరి అందుకే మహేష్ ఎంత హ్యాపీగా ఉన్నదో అతను విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న ట్రిప్ ని చూస్తే తెలుస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*