భరత్ రెండో రోజు బాగానే లాగేసింది
భరత్ అనే నేను సినిమా కలెక్షన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. మహేష్ బాబు కి రెండు డిజాస్టర్స్ తర్వాత తగిలిన హిట్ భరత్ అనే నేను. విమర్శకులు సైతం మెచ్చిన చిత్రం గా భరత్ అనే నేనుకి మంచి మార్కులు వేసేసారు. ఇక కొరటాల కి కూడా తన నాలుగో సినిమా కూడా హిట్ అవడంతో కొరటాల కూడా పిచ్చ హ్యాపీ గా వున్నాడు. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కొట్టడమే కాదు నాన్ బాహుబలి రికార్డులను సృష్టిస్తుంది. ఇప్పటికే రామ్ చరణ్ రంగస్థలం సినిమా రికార్డులని తిరగరాస్తున్న మహేష్ భరత్ అనే నేను సెకండ్ డే కూడా మంచి జోరు కొనసాగించింది. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ భారత్ అనే నేను చెప్పుకోవచ్చని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తుంటే... ఈ వీకెండ్ ముగిసే సరికే పెట్టిన పెట్టుబడి చాలా వరకు లాగేస్తుందంటున్నారు. ఏపీ మరియు తెలంగాణ లలో రెండు రోజుల్లో భరత్ లాగిన కలెక్షన్స్ షేర్స్ లో...
ఏరియా రెండు రోజుల షేర్స్ కోట్లలో
నైజాం 7.15
సీడెడ్ 3.71
నెల్లూరు 1.15
కృష్ణా 2.57
గుంటూరు 4.71
వైజాగ్ 3.97
ఈస్ట్ గోదావరి 3.80
వెస్ట్ గోదావరి 2.20
రెండు రోజుల టీఎస్ అండ్ ఏపీ షేర్స్ 29.26