భరత్ అనే నేను మళ్ళీ సేఫ్ జోన్ లోకెళ్ళిపోయాడు

ప్రస్తుతం మహేష్ బాబు భరత్ అనే నేను ధనాధన్ కలెక్షన్స్ తో బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. గత శుక్రవారం విడుదలైన భరత్ అనే నేను పాజిటివ్ టాక్ తో బాక్సాఫీసుని దున్నేస్తుంది. అయితే భరత్ అనే నేను కలెక్షన్స్ ని ఈ శుక్రవారం విడుదలైన సినిమాలేమన్నా అడ్డుకట్ట వేస్తాయేమో అనుకున్న వారికీ… ఆ రెండు సినిమాల ఫలితాలు.. భరత్ ని ఏం చేయలేవని తేలిపోయింది. ఎందుకంటే ఈ శుక్రవారం విడుదలైన సాయి పల్లవి కణం సినిమా ఒక మెస్సేజ్ ఒరింటెడ్ ఫిలిం గా ఒక వర్గం ప్రేక్షకలను మాత్రం అలరించగా… మంచు విష్ణు – బ్రహ్మానందం కలిసి కామెడీ చేసిన ఆచారి అమెరికా యాత్ర మరీ దారుణమైన ఫలితాన్ని చవి చూసింది.

కణం సినిమా కాస్త యావరేజ్ టాక్ తో ఉంటె…. మంచు విష్ణు ఆచారి అమెరికా యాత్ర కి అట్టర్ ప్లాప్ టాక్ రావడంతో మహేష్ కి మరో వారం ఎదురులేకుండా పోయింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దున్నేస్తున్న మహేష్ భరత్ అనే నేను మరో వారం పాటు బాక్సాఫీసుని చెడుగుడు ఆడుకోవడానికి రెడీ అయ్యింది. ఇక అల్లు అర్జున్ నా పేరు సూర్య వచ్చే వరకు భరత్ కి ఎదురే లేదు. అంటే వచ్చే శుక్రవారం మే నాలుగు వరకు భరత్ అనే నేను పండగ చేసుకోవడం ఖాయం. మరి ఇలానే రంగస్థలానికి కూడా రెండు వరాల పాటు సినిమాలు పోటీ ఇచ్చేది లేక కలెక్షన్స్ వర్షం కురిసింది. మరి ప్రస్తుతం భరత్ పరిస్థితి కూడా అలానే ఉంది.

చూద్దాం ఫైనల్ రన్ లో రంగస్థలం ఎక్కువ కలెక్షన్స్ కొల్లగొడుతుందో.. లేదంటే మహేష్ బాబు భరత్ అనే నేను ఎక్కువ కలెక్షన్స్ కొల్లగొడుతుందో… అది కాదంటే… అల్లు అర్జున్ నాపేరు సూర్య సూపర్ హిట్ అయ్యి ఈ రెండు సినిమాల కలక్షన్స్ ని క్రాస్ చేస్తుందో అనేది.. వెయిట్ అండ్ సి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*