భరత్ సంతోషం మాములుగా లేదుగా

మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ విజయంతో ఆనందంలో మునిగితేలుతున్నాడు. తేలడా మరి…. ‘బ్రహ్మ్మోత్సవమ్, స్పైడర్’ చిత్రాల ప్లాప్ తో డీలా పడ్డ మహేష్ కి ‘భరత్ అనే నేను’ విజయాన్నిఅందించి నెత్తి మీద పాలుపోసింది. రెండు డిజాస్టర్స్ తర్వాత వచ్చిన హిట్ తో మహేష్ కి ఎక్కడలేని హ్యాపీనెస్ వచ్చేసింది. అందుకే సినిమాకి ముందే ఫ్యామిలీతో విదేశాలకు చెక్కేసిన మహేష్…. సినిమా విడుదలయ్యాక తన భర్యతో గడిపిన ఆనందక్షణాలను ఒక పిక్ రూపంలో పోస్ట్ చేసాడు. ఆ పిక్ లో నమ్రతకి లిప్ కిస్ పెడుతున్న భర్త ఇప్పుడు కొరటాల అండ్ భరత్ టీమ్ తో కలిసి పార్టీ చేసుకున్నాడు.

పార్టీ చేసుకున్నాడు కాదు.. తానే భరత్ టీమ్ కి ఒక పెద్ద పార్టీ ఇచ్చేసాడు. సినిమా మీదున్న కాన్ఫిడెన్స్ తో సినిమా విడుదలకు మునుపే భరత్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన చాలామందికి ఐ ఫోన్ 10 ని గిఫ్ట్ లుగా ఇచ్చిన మహేష్ బాబు ఇప్పుడు సినిమా విడుదలై విజయం సాధించాక ‘భారత అనే నేను’ టీమ్ కి భారీ పార్టీ ఇచ్చేసాడు. ప్రస్తుతం ‘భరత్ అనే నేను’ నాన్ బాహుబలి రికార్డులను సృష్టిస్తూ అదరగొట్టే పెరఫార్మెన్స్ చేస్తుంది. అందుకే మహేష్ ఈ ఆనందంలో భరత్ టీమ్ కి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఇక ఈ పార్టీకి కొరటాలతో పాటు భరత్ టెక్నీకల్ టీమ్ మొత్తం పాల్గొన్నట్లుగా తెలుస్తుంది.

ఈ సినిమా విజయంతో ఫుల్ ఖుషీగా ఉన్న మహేష్ బాబు తన 25 వ చిత్రం కోసం రేడి అవుతున్నాడు. అయితే మహేష్, వంశి పైడిపల్లితో చెయ్యబోయే సినిమాలో పూజ హెగ్డే తో జోడి కడుతున్నాడు. ఇక ఈ సినిమా వచ్చే జూన్ నుండి పట్టాలెక్కేచాన్సు ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*