అఫిషియల్ : 205 కోట్లు వసూల్ చేసిన భరత్!

మహేష్ బాబు

టాలీవుడ్ భవిషత్తును ఈ ఏడాదిలో రిలీజ్ అయిన సినిమాలు మార్చేశాయి అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సమ్మర్ లో విడుదల అయిన ‘రంగస్థలం’..’భరత్ అనే నేను’..’నా పేరు సూర్య’.. ‘మహానటి’ సినిమాలు తెలుగు సినిమా స్థాయిని పెంచేసాయి. అందులో మరీ ముఖ్యంగా రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా, కొరటాల – మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ‘భరత్ అనే నేను’.

బాక్సాఫీసు వద్ద పోటీ పడుతూ….

ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ‘భరత్ అనే నేను’ లేటెస్ట్ గా రూ. 205 కోట్లు దాటిందని..నిర్మాత డీవీవీ దానయ్య తన అధికార ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తొలి రోజునుండి రికార్డుల వేట కొనసాగిస్తున్న ఈ సినిమా మూడు వారాల్లోనే రూ. 205 కోట్లను తాకడం గమనార్హం.

రికార్డుల మీద రికార్డులు….

తొలి రోజు 40 కోట్లుని వసూల్ చేసిన ఈ సినిమా..మొదటివారంలో రూ. 161 కోట్లను, ఆపై రెండో వారంలో రూ. 190 కోట్ల కలెక్షన్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఓవరాల్ గా మూడువారాలు వచ్చేసరికి రూ. 205 కోట్లు గ్రాస్ ని వసూల్ చేసి రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత మహేష్ జూన్ నుండి వంశీ పైడిపల్లి సినిమాలో నటించనున్నాడు.

Ravi Batchali
About Ravi Batchali 36021 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*