ఎఫ్ 2లో బిగ్ బాస్ పార్టిసిపెంట్

f 2 collections in telugu states

ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మూడింటికి మూడు సపరేట్ జోనర్స్ కాబట్టి ఏ సినిమాకి ఏ సినిమా పోటీ కాదు. వెంకీ – వరుణ్ నటించిన ‘ఎఫ్ 2 ‘ పైన భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 12న విడుదల అవుతున్న ఈ సినిమాను పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసాడు. కామెడీ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో ‘బిగ్ బాస్ 2’ సీజన్ లో కంటెస్టెంట్ ఒకరు నటించారు. ‘బిగ్ బాస్ 2’ సీజన్ లో సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన తెలుగు కంటెస్టెంట్ నూతన్ నాయుడు ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమవుతున్నాడు. ఇది నిజమే అని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ మూవీలో ఆయన కామిక్ రోల్ లో నటించారని తెలుస్తుంది. మరి ఇంతవరకు నూతన్ నాయుడు ‘ఎఫ్ 2’లో నటించినట్టు ఎక్కడా ప్రచారం జరగలేదు. కానీ ఇది నిజమే అని చెబుతున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా నటించారు. దేవీ శ్రీ సంగీతం అందించినా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*